Baldia Commissioner : ప్రమాణాలు పాటిస్తేనే అనుమతులు
నిర్దేశిత ప్రమాణాలు పాటిస్తేనే భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేస్తామని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు.
దిశ, వరంగల్ టౌన్ : నిర్దేశిత ప్రమాణాలు పాటిస్తేనే భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేస్తామని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లు, భవన నిర్మాణాల అనుమతుల కోసం పలువురు దరఖాస్తు చేసిన నేపథ్యంలో వాటికి అనుమతుల మంజూరు కోసం కమిషనర్ మంగళవారం నగర పరిధిలోని పలు ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా నగర పరిధిలోని ఎక్సైజ్ కాలనీ, వడ్డేపల్లి, మడికొండ, ఎల్బీనగర్, దేశాయిపేట ప్రాంతాల్లో నిర్మిత ప్రాంతాలను కమిషనర్ పరిశీలించి నిర్మాణాల కోసం నమోదు చేసిన వివరాలు క్షేత్ర స్థాయిలో కొలతలు వేసి నిర్ధారణ జరిపారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ… సరియైన ధృవ పత్రాలు, నమోదు చేసిన కొలతలు క్షేత్ర స్థాయిలో సరిపోతే అనుమతులు జారీ చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి సిటీ ప్లానర్ రవీంద్ర రాడేకర్, సిఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేష్, ఎసిపి ఇర్షద్, సానిటరీ ఇన్స్పెక్టర్ ధరమ్ సింగ్, పాల్గొన్నారు.