పాలకుర్తి ప్రజలకు ధైర్యం ఎక్కువ : ఝాన్సీ రెడ్డి
పాలకుర్తి ప్రజలకు ధైర్యం ఎక్కువ భయపెడితే భయపడే వాళ్ళు కాదు.
దిశ, పెద్దవంగర: పాలకుర్తి ప్రజలకు ధైర్యం ఎక్కువ భయపెడితే భయపడే వాళ్ళు కాదు. నేనున్నానంటూ పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి భరోసానిచ్చారు. మంగళవారం పాలకుర్తి నియోజకవర్గం పెద్దవంగర మండలంలో చిన్న వంగర, చిట్యాల గ్రామాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రతి కార్యకర్త సైనికునిలాగా పనిచేయాలన్నారు. అధికార పార్టీ భయబ్రాంతులకు గురి చేసిన భయపడవద్దని, మీకు అండగా నేనున్నన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పార్టీలకు అతీతంగా, అర్హులైన వారందరికీ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను అందజేస్తుందని రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బూత్ స్థాయి కష్టపడి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్నారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎమ్మెల్యేగా వచ్చే జీతాన్ని కూడా పాలకుర్తి నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసమే ఉపయోగిస్తామన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమల్లోకి తీసుకువస్తామని తెలిపారు. నిరుద్యోగులకు భారీగా డీఎస్సీ మొదలగు నోటిఫికేషన్లు వేసి ఉద్యోగ అవకాశాలు కల్పించి వారి అభివృద్ధికి బాటలు వేస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఈగ నుండి ప్రజాసేవకే అంకితం అవుతూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవలందిస్తానని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో గెలుపొందిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మంత్రి అయి కూడా ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఎద్దేవా చేశారు.కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోను కాపీ కొడుతూ మేనిఫెస్టో రూపొందించారని రెండుసార్లుగా మోసం చేసిన తెలంగాణ ప్రజలు సీఎం కేసీఆర్ మేనిఫెస్టోను ఆయన మాటలను నమ్మడం లేదని ఇక్కడున్నా మంత్రి మాయమాటలు చెబుతూ ప్రజలను మోసం చేసేందుకు మళ్ళీ ఓట్లు అడగడానికి వస్తున్నాడని మండిపడ్డారు.
పాలకుర్తి మన అడ్డా ..
పాలకుర్తి మన అడ్డా కానీ ఎర్రబెల్లి తన అడ్డాగా మార్చుకున్నాడు. ఇప్పుడు మనం లోకల్ అయన నాన్ లోకల్ ఈగ నుండి ఈ పాలకుర్తి అడ్డా మనదే. వందకు రెండు వందల శాతం కాంగ్రెస్ టికెట్ నాకే.ఈగ నుండి పాలకుర్తి అడ్డా నాదే. బీఆర్ఎస్ పార్టీ చెప్పే మాటలు నమ్మవద్దు ఇవన్నీ వారి జిమ్మిక్కులు లొంగకండి. నేనున్న, నేనుంటా. ఒక్కసారి ఆశీర్వదించండి. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హామ్య నాయక్, మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్, పీసీసీ మాజీ సభ్యులు నిరంజన్ రెడ్డి, మహబూబాబాద్ జిల్లా జాయింట్ సెక్రటరీ ముత్యాల పూర్ణ చందర్, మండల ఉపాధ్యక్షులు రంగు మురళి, మండల సీనియర్ నాయకులు తోటకూరి శ్రీనివాస్,పన్నీరు వేణు,మండల ప్రధాన కార్యదర్శి ఓరుగంటి సతీష్,మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పబ్బతి సంతోష్ యాదవ్,ఎంపీటీసీ మెట్టు నగేష్ సౌజన్య, నాయకులు రామ్ రెడ్డి, సీతారాం నాయక్, శ్యామ్, ఉపేందర్ రెడ్డి,రామకృష్ణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.