చింత చెట్టుకు కల్లు..చూసేందుకు ఎగబడుతున్న జనం

కొన్ని ఘటనలు చూస్తే నిజంగానే ఆశ్చర్యం కలగకమానదు.

Update: 2024-12-04 07:04 GMT

దిశ, కొత్తగూడ : కొన్ని ఘటనలు చూస్తే నిజంగానే ఆశ్చర్యం కలగకమానదు. ఇప్పటి వరకు పలు చెట్ల నుంచి నీరు వచ్చిన దృశ్యాలు చూశాం.. తాజాగా బుధవారం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. తాటి, ఈత, వేప చెట్లకు కల్లు రావడం మన అందరికీ తెలిసిన విషయమే.. కానీ వీటన్నింటికి భిన్నంగా ఆ గ్రామంలోని ఓ చింత చెట్టుకు కల్లు పారుతున్నది.ఈ వార్త సంచలనంగా మారింది. విషయం తెలుసుకున్న జనం విచిత్ర ఘటనను చూసేందుకు తరలి వస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. కొత్తగూడ మండల కేంద్రంలోని వెలుబెల్లి గ్రామ పంచాయతీ సమీపంలోని పోచమ్మ గుడి దగ్గర ఉన్న చింత చెట్టుకు కల్లు ఏరులై పడుతుండడంతో ఆశ్చర్యంతో తండోపతండాలుగా విచిత్రంగా చూస్తూ ఇది బ్రహ్మం గారి మహిమ అని బ్రహ్మం గారు చెప్పినట్టు జరుగుతుందని చర్చించుకుంటూ చింత కల్లు రుచి చూస్తూ అబ్బా అంటూ లొట్టలు వేస్తున్నారు గ్రామస్తులు.


Similar News