గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే...

మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల వసతి గృహాన్ని ఎమ్మెల్యే ముఖ్య మురళి నాయక్ ఆకస్మికంగా పర్యటించి తనిఖీ చేశారు.

Update: 2024-12-04 11:39 GMT

దిశ, ఇనుగుర్తి (నెల్లికుదురు) ; మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల వసతి గృహాన్ని ఎమ్మెల్యే ముఖ్య మురళి నాయక్ ఆకస్మికంగా పర్యటించి తనిఖీ చేశారు. బుధవారం మండలంలోని ప్రజా పాలన విజయోత్సవ కార్యక్రమం ముగించుకున్న అనంతరం సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల తరగతి గదుల నిర్వహణ, త్రాగునీటి సౌకర్యం, విద్యార్థులకు అందుతున్న భోజన నాణ్యత గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలోని సదుపాయాల, చెత్త, మరుగుదొడ్ల, నిర్వహణ, సిజనల్ జ్వరాలు, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి, ఉపాధ్యాయులను అడిగి తెలుసుకుని, విద్యార్థులతో ఆత్మీయంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని, విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. విద్యార్థుల సమస్యలపై సంబంధిత అధికారులు మా దృష్టికి తీసుకురావాలని, సీజనల్ జ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ పరిసర పరిశుభ్రత పాటించాలన్నారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వం వసతి గృహాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. అంతకు ముందు రాము తండా జిపి భవనానికి శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ రవి, ఏవో మహేందర్, డిసిసి ఉపాధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు సతీష్, మాజీ మండల పార్టీ అధ్యక్షులు అశోక్ గౌడ్, ఇనుగుర్తి గ్రామ అధ్యక్షులు గంజి రాజేందర్ రెడ్డి, జిల్లా, మండల నాయకులు మహేందర్ రెడ్డి, వల్లముల మురళి, మహంకాళి రామ్, వెంకన్న నాయక్, కట్టయ్య. ముదిరెడ్డి శ్రీనివాసరెడ్డి వీరన్న నాయక్ లోకేష్ నాయక్ శివాజీ సురేష్ మార్కెట్ డైరెక్టర్లు, సొసైటీ డైరెక్టర్లు, అధికారులు, కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.


Similar News