దిశ, బెజ్జుర్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం నుంచి మహారాష్ట్రలోని చెప్రాల ఆధ్యాత్మిక కేంద్రానికి 17వ మహా పాదయాత్ర మంగళవారం ఉదయం ఎలకపల్లి అభయాంజనేయ ఆలయం నుండి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రారంభమైంది. సంప్రదాయబద్ధందిశ, బెజ్జుర్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం నుంచి మహారాష్ట్రలోనిగా 17వ మహా పాదయాత్ర జై శ్రీరామ్ జై కార్తీక స్వామి జై హనుమాన్ కు జై అంటూ నినాదాలు చేస్తూ మహా పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఈ పాదయాత్రకు బెజ్జూర్, చింతల తదితర మండలాలకు చెందిన భక్తులు ఉన్నారు. ఈ పాదయాత్ర సాయంత్రానికి మహారాష్ట్రలోని ఆధ్యాత్మిక కేంద్రానికి చేరుకోనుంది. ఈ పాదయాత్ర బెజ్జూర్ మండలం ఎల్కపెళ్లి నుండి 17 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. పాదయాత్ర వల్ల భక్తులకు మానసిక ప్రశాంతతతోపాటు, శరీర ఆరోగ్యం బాగుంటుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ భక్తులు పాదయాత్రలో పాల్గొన్నారు.