అడవిలో అమృతధార!

వేసవిలో వన్యప్రాణుల దాహం తీర్చడానికి ములుగు జిల్లా ఫారెస్ట్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

Update: 2023-04-05 01:56 GMT

దిశ, ములుగు ప్రతినిధి: ఎండలు మండుతున్నాయి. భానుడి ప్రతాపానికి మూగజీవాలు అల్లాడుతున్నారు. అడవుల్లో నీటి వనరులు ఎండిపోతుండడంతో జంతువులు దప్పికతో అలమటిస్తుంటాయి. ఈ క్రమంలో వన్యప్రాణుల సంరక్షణకు అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వేసవి నేపథ్యంలో పక్కా ప్రణాళిక ప్రకారం ములుగు జిల్లా అధికారులు ముందుకుసాగుతున్నారు. వన్యప్రాణుల దాహార్తిని తీర్చడం కోసం అడవుల్లో కృత్రిమంగా నీటివనరులను ఏర్పాటు చేస్తున్నారు. 2031 ఎకరాల్లో విస్తరించి ఉన్న అడవిలో వందల రకాల జీవులు సంచరిస్తుంటాయి. ఎండాకాలంలో నీటి కోసం ప్రత్యేకంగా రూ.16కోట్లు వెచ్చింది 100కు పైగా నీటి గుంటలు, 55 సిమెంట్​తొట్టెలు, 660 చిన్నరాతి కట్టడాలు, 50 పర్కులేషన్​ట్యాంకులు, ఆరు సోలార్​బోర్​వెల్స్​ఏర్పాటు చేసినట్లు అటవీ అధికారులు వెల్లడించారు. వన్యప్రాణులు ఎక్కువగా సంచరించే ప్రాంతాలు, నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రదేశాలను గుర్తించి వాటి నిర్మాణం చేపట్టారు. మరో వైపు వన్యప్రాణుల వేటగాళ్లపై దృష్టిసారించారు. నీటివనరుల వద్ద వేటగాళ్ల ఉచ్చులకు వన్యప్రాణులు బలికాకుండా ఉండేందుకు నిరంతరం గస్తీ, వాచ్ టవర్స్, కెమెరా ట్రాప్స్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

2022-23 గాను 2031 ఎకరాల్లో ఉన్న అడవిలో అడవి దున్న, కొండ గొర్రెలు, ముళ్లపందులు, కృష్ణ జింకలు, నీల్ గాయ్, ఎలుగుబంటి, జింకలు, దుప్పులు, అడవి కోళ్ళు, నెమల్లు, కుందేలు మొదలగు జీవ జాతులు సంచరిస్తుంటాయి. ఎండాకాలంలో నీటి కోసం సుమారు రూ.16 కోట్లతో 100 పైగా నీటి గుంటలు, 55 సిమెంటు నీటి తొట్టెలు, 660 చిన్న రాతి కట్టడాలు, 50 పర్కులేషన్ ట్యాంక్కులు, 6 సోలార్ బోర్ వెల్స్ ఏర్పాటు చేసినట్టు జిల్లా అటవీశాఖ అధికారులు వెల్లడించారు. అడవిలో నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రదేశాల్లో, వన్యప్రాణులు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో వీటిని నిర్మాణం చేపట్టిన్నట్టు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. వన్యప్రాణులకు అడవిలో నీటిని అందించడంతో నీటి జాడలు వెతుక్కుంటూ గ్రామాల్లోకి వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని, నీటి లభ్యత ఉన్న చుట్టుపక్కల గడ్డి మొలిచి ఎండాకాలంలో ఆహార లభ్యత కూడా మెరుగయ్యే అవకాశం ఉంటుంది.

దిశ, ములుగు ప్రతినిధి: అడవుల జిల్లాగా పేరుగాంచిన ములుగుకు రాష్ట్రం నలుమూలల నుంచి పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. జిల్లాలోని అన్ని మండలాల్లో అటవీ విస్తీర్ణం విస్తరించి ఉండడంతో వన్యప్రాణుల ఆవాసాలకు అనువుగా మారింది. ఈ క్రమంలో వన్యప్రాణుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండడంతో వాటి సంరక్షణకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వేసవిలో వన్యప్రాణులు ఆహారం, నీటి కోసం అలమటిస్టుంటాయి. వేసవిలో అడవిలో నీటి వనరులు అడుగంటిపోవడం, ఎండిపోవడంతో వన్యప్రాణులు నీటికోసం జనసంచారంలోకి వస్తుంటాయి. ఈ క్రమంలో వేటగాళ్ల బారిన పడి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చాలానే ఉన్నాయి. వన్యప్రాణుల దాహార్తి తీర్చడం కోసం ఫారెస్ట్ అధికారులు అటవీ ప్రాంతంలో తాత్కాలిక నీటి వనరులను ఏర్పాటు చేస్తున్నారు. వన్యప్రాణుల ఆకలి, దప్పిక కోసం ఎంచుకున్న ప్రదేశాల్లో కృత్రిమంగా నీరు నిల్వ ఉండేలాగా చెక్ డ్యాంలు నిర్మిస్తున్నారు. నీటి వనరులు లేని చోట బోర్లు వేసి సోలార్ తో నడిచే మోటార్లను బిగిస్తున్నారు. తద్వారా వన్యప్రాణుల కోసం నీరు, గడ్డి కొరతను తీర్చగలుగుతున్నారు.

వేసవిలో నీటి కోసం ప్రణాళిక..

2022-23 గాను 2031 ఎకరాల్లో ఉన్న అడవిలో అడవి దున్న, కొండ గొర్రెలు, ముళ్లపందులు, కృష్ణ జింకలు, నీల్ గాయ్, ఎలుగుబంటి, జింకలు, దుప్పులు, అడవి కోళ్ళు, నెమల్లు, కుందేలు మొదలగు జీవ జాతులు సంచరిస్తుంటాయి. ఎండాకాలంలో నీటి కోసం సుమారు రూ.16 కోట్లతో 100 పైగా నీటి గుంటలు, 55 సిమెంటు నీటి తొట్టెలు, 660 చిన్న రాతి కట్టడాలు, 50 పర్కులేషన్ ట్యాంక్కులు, 6 సోలార్ బోర్ వెల్స్ ఏర్పాటు చేసినట్టు జిల్లా అటవీశాఖ అధికారులు వెల్లడించారు. అడవిలో నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రదేశాల్లో, వన్యప్రాణులు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో వీటిని నిర్మాణం చేపట్టిన్నట్టు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. వన్యప్రాణులకు అడవిలో నీటిని అందించడంతో నీటి జాడలు వెతుక్కుంటూ గ్రామాల్లోకి వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని, నీటి లభ్యత ఉన్న చుట్టుపక్కల గడ్డి మొలిచి ఎండాకాలంలో ఆహార లభ్యత కూడా మెరుగయ్యే అవకాశం ఉంటుంది.

నీటి వనరులపై వేటగాళ్ల కన్ను..

ప్రతి యేడాది వన్యప్రాణుల దాహార్తి తీర్చడం కోసం అటవీశాఖ అధికారులు నీటి కుంటలను ఏర్పాటు చేయడంతో వాటి పరిసర ప్రాంతాల చుట్టూ జీవాల ఉనికి ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో ఆ ప్రదేశాలపై వేటగాళ్లు దృష్టి సారించారు. ఇదే అదునుగా నీటి కుంటల చుట్టూ అడవి జంతువులు తిరిగే ప్రదేశాల వద్ద ఉచ్చులు ఏర్పాటుచేస్తున్నారు. నీటి కుంటల చుట్టుపక్కల వేటను కొనసాగిస్తూ అటవీ జంతువులపై దాడులు నిర్వహిస్తున్నారు. వేటగాళ్లకు జంతువులు బలికాకుండా దృష్టి సారించాలని ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు.

నీటి కుంటల చుట్టూ నిఘా.. ఎఫ్ డీఓ జోగేందర్

అడవి జంతువుల నీటి అవసరాల కోసం శాశ్వత, తాత్కాలిక ఏర్పాట్లు పూర్తి చేశాం. సోలార్ నీటి పంపులు, సాసర్ పిట్స్, చెక్ డ్యాంలు నిర్మించి ఎప్పుడు నీరు ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. అటవీ రక్షణ కోసం వాచ్ టవర్స్, అక్కడక్కడ కెమెరా ట్రాప్స్ ఏర్పాటు చేశాం. నీటి వనరుల చుట్టూ 24 గంటలు ఫారెస్ట్ సిబ్బందితో గస్తీ నిర్వహిస్తున్నాం. అటవీ జంతువులు వేటగాళ్ల బారిన పడకుండా గట్టి నిఘా ఏర్పాటు చేశాం.

Tags:    

Similar News