మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ..పలు గ్రామాలకు మురికి నీరు సరఫరా
బచ్చన్నపేట మండల కేంద్రంలో కేసీఆర్ చౌరస్తా అనే కూడలి
దిశ,బచ్చన్నపేట : బచ్చన్నపేట మండల కేంద్రంలో కేసీఆర్ చౌరస్తా అనే కూడలి సమీపంలో ప్రధాన మిషన్ భగీరథ పైప్ లైన్ కు లీకుల మయంగా మారింది. లీకుల జరిగిన ప్రాంతంలో బురద నీటిలో పందులు , కుక్కలు సంచరిస్తున్నాయి. బురద నీరు ప్రధాన పైపుల గుండా నీరు సప్లై లేని సమయంలో అదే నీరు వెళ్లడంతో వాటిని ఇంటింటికి నల్లా నీరు ద్వారా స్థానికులు త్రాగు నీరు గా వాడటంతో అనేక మంది స్థానికులు రోగాల బారిన పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి . దీనిని మానిటరింగ్ చేసే ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారులు చూసి చూడనట్లు ఆరోపణలు ఉన్నాయి . ఇప్పటికైనా అధికారులు పైప్ లైన్ లీక్ సరిచేసి పరిశుద్ధమైన జలాలను అందించిన ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని పలువురు వేడుకుంటున్నారు.
దీనిపై మిషన్ భగీరథ గ్రిడ్ ఏఈ దినేష్ ను వివరణ కోరగా బచ్చన్నపేట రోడ్డు సమీపంలో కెసిఆర్ చౌరస్తా ఏరియాలో పైపుల లీక్ లు అయినట్లు మా దృష్టికి రాలేదు . ఎప్పుడైనా పైప్ లైన్ లీక్ పునరుద్దరణ సమయంలో నీటి సప్లై ఆపి రిపేరు చేయవలసి ఉంటుందని అన్నారు.చిన్న చిన్న లీకుల జరిగినా ఇప్పుడు ఏమి కాదని ఆ నీటిని త్రాగు నీటి కోసం వాడిన ఇబ్బంది ఉండదని బదులు ఇచ్చారు .వాటి రిపేర్ సెక్షన్ పెట్టాలంటే సదాశివపేట, నక్కవాని గూడెం, ఇటికాల పల్లి మూడు గ్రామాలకు నీరు సప్లై ఆగిపోతుందని అన్నారు.