దిశ ఎఫెక్ట్ : స్పందించిన మిషన్ భగీరథ అధికారులు

మిషన్ భగీర పైప్ లైన్ లీకేజీ పలు గ్రామాలకు మురికి నీరు సరఫరా' అనే శీర్షికతో దిశ దినపత్రికలో ప్రచురితమైన వార్తకు స్పందన లభించింది.

Update: 2024-12-29 15:40 GMT

దిశ, బచ్చన్నపేట : మిషన్ భగీర పైప్ లైన్ లీకేజీ పలు గ్రామాలకు మురికి నీరు సరఫరా' అనే శీర్షికతో దిశ దినపత్రికలో ప్రచురితమైన వార్తకు స్పందన లభించింది. పైప్ లైన్ మరమ్మతుకు అధికారులు స్పందించారు. బచ్చన్నపేట మండలం కేసీఆర్ చౌరస్తా అనే కూడలి సమీపంలో పగిలిన పైప్ లైన్ కారణంగా నీరు వృథా పోతూ… కుక్కలు,పందులు సంచరించి బురదగా మురికి నీరు పైప్ లైన్ లో వెళ్లి ఆ మురికి నీరు గ్రామాల్లోని ఇంటి నల్లల ద్వారా వెళ్లడం వల్ల అనారోగ్యం పాలవుతున్నారని దిశ వెలుగులోకి తీసుకొచ్చింది. జేసీబీ సిబ్బంది సహాయంతో మరమ్మత్తు పనులను శరవేగంగా పూర్తి చేశారు. పైప్ లైన్ లీకేజీ తో చుట్టూ పక్కల గ్రామాల ప్రజలు భయానికి గురవుతున్నారు. ప్రస్తుతం చేపడుతున్న మరమ్మతు పనులను పకడ్బందీగా చేపట్టి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని గ్రామస్థులు కోరుతున్నారు.


Similar News