ఇందిరమ్మ ఇళ్ల సర్వేను వేగవంతం చేయాలి…: సత్య శారద

సంగెం మండలంలోని పల్లార్ గూడ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల

Update: 2025-01-01 11:59 GMT

దిశ, హనుమకొండ : సంగెం మండలంలోని పల్లార్ గూడ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వేను జిల్లా పాలనాధికారి డాక్టర్ సత్య శారద తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే చేస్తున్న విధానాన్ని ఆమె పరిశీలించారు. ఇందిరమ్మ యాప్ లో ఏ విధంగా లబ్ధిదారుల వివరాలు నమోదు చేస్తున్నారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వేను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. సర్వేలో ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం లబ్ధిదారుల వివరాలు ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా నమోదు చేయాలని, సర్వే ను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో రాం రెడ్డి ,తహసిల్దార్ రాజ్ కుమార్, ఎంపీడీవో రవీందర్, గ్రామ కార్యదర్శి అజయ్, సెర్ప్ సీసీ బొజ్జ సురేష్, అధికారులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు కుమారస్వామి, గ్రామ పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


Similar News