చేరువలో పాలన.. భవనం లేక వేదన
ప్రజలకు పాలన చేరువ కావాలన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం కొత్త గ్రామపంచాయతీలను ఏర్పాటు చేసింది.
దిశ,డోర్నకల్ : ప్రజలకు పాలన చేరువ కావాలన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం కొత్త గ్రామపంచాయతీలను ఏర్పాటు చేసింది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం కన్నెగుండ్ల గ్రామపంచాయతీగా ఏర్పాటు జరిగి ఏండ్లు గడిచిన గత ప్రభుత్వం సొంత భవనం సమకూర్చలేదు. దీంతో పాలకవర్గ సమయంలో నెలనెలా గ్రామసభలు, పాలకవర్గ సమావేశాలు నిర్వహించేందుకు ఇబ్బందులు తప్పలేదు. ప్రస్తుతం రేకుల గదిలో గ్రామ పంచాయతీ కార్యాలయం నిర్వహిస్తున్నారు. తలుపు శిథిలావస్థకు చేరడంతో విలువైన సామాగ్రి, రికార్డుల భద్రతకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రజా పాలనలో కన్నెగుండ్ల గ్రామపంచాయతీకి సొంత భవనం సమకూర్చాలని స్థానికులు కోరుతున్నారు.