Minister Sitakka: ఏజెన్సీలో మంత్రి సీత‌క్క ప‌ర్య‌ట‌న‌..

సోమ‌వారం మంత్రి సీత‌క్క‌ ములుగు జిల్లా,

Update: 2024-07-22 08:59 GMT

దిశ‌,ఏటూరునాగారం: సోమ‌వారం మంత్రి సీత‌క్క‌ ములుగు జిల్లా, ఏటూరునాగ‌రం మండ‌లంలో ప‌ర్య‌టించి వ‌ర‌ద ముంపు ప్రాంతాలను సంద‌ర్శించారు. ఈ సంద‌ర్బంగా మంత్రి సీత‌క్క ఏటూరునాగారం మండ‌ల కేంద్రంలోని సామాజిక ప్ర‌భుత్వ ఆసుప‌త్రిని సంద‌ర్శించి వ‌ర‌ద ముంపు ప్రాంతాలైన వాజేడు, వెంక‌ట‌పురం మండ‌లాల నుండి ముంద‌స్తుగా త‌ర‌లించిన గ‌ర్భీణీ స్త్రీల‌తో మాట్ల‌డారు. అనంత‌రం ఐసీయు, ఇంటెన్సీవ్ కేర్ యూనిట్లో అందింస్తున్న సేవ‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం అక్క‌డి బ‌య‌లుదేరిన మంత్రి సీత‌క్క వాజేడు మండ‌లం పూసూరు బ్రిడ్జి వ‌ద్ద వ‌ర‌ద ఉదృతిని సంద‌ర్శించి సంభందిత అధికారుల‌తో మాట్ల‌డి వివ‌రాలు తెలుసుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో జిల్లాక‌లెక్ట‌ర్ దివాక‌ర.టి.ఎస్‌, స్థానిక సంస్థ‌లు పి.శ్రీ‌జ, ఇరిగేష‌న్ ఇంజనీరింగ్ అధికారులు, త‌దిత‌ర శాఖల అధికారుల‌, కాంగ్రెస్ నాయ‌కులు పాల్గోన్నారు.

Tags:    

Similar News