జర్నలిస్టు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి
రాయపర్తి మండల కేంద్రానికి చెందిన సీనియర్ జర్నలిస్టు వలబోజు రవీందర్ గురువారం గుండెపోటుతో మృతి చెందారు.
దిశ, రాయపర్తి : రాయపర్తి మండల కేంద్రానికి చెందిన సీనియర్ జర్నలిస్టు వలబోజు రవీందర్ గురువారం గుండెపోటుతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుక్రవారం రవీందర్ ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. రవీందర్ కుటుంబానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని, ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
జర్నలిస్టుగా రవీందర్ చేసిన సేవలను గుర్తుకు తెచ్చుకున్నారు. ఆయన వెంట జిల్లా నాయకులు గుడిపూడి గోపాలరావు, మండల పార్టీ అధ్యక్షులు మూనావత్ నరసింహ నాయక్, మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ బిల్లా సుధీర్ రెడ్డి, సర్పంచ్ గారి నర్సయ్య, మండల నాయకులు ఆకుల సురేందర్రావు, పూస మధు, సత్యం, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.