medicover Hospital : తవి చికిత్సను విజయవంతంగా చేసిన మెడికవర్ హాస్పిటల్ డాక్టర్లు..

మెరుగైన చికిత్స కోసమంటూ మెట్రో నగరాలకు పరుగు పెట్టవలసిన అవసరం లేదిప్పుడు. మొట్టమొదటి సారిగా వరంగల్ పట్టణంలో అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించడం ద్వారా మెడికవర్ హాస్పిటల్ వైద్య పరంగా నూతన ప్రమాణాలను నిర్దేశించింది.

Update: 2024-10-26 11:06 GMT

దిశ, హనుమకొండ: మెరుగైన చికిత్స కోసమంటూ మెట్రో నగరాలకు పరుగు పెట్టవలసిన అవసరం లేదిప్పుడు. మొట్టమొదటి సారిగా వరంగల్ పట్టణంలో అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించడం ద్వారా మెడికవర్ హాస్పిటల్ (medicover Hospital) వైద్య పరంగా నూతన ప్రమాణాలను నిర్దేశించింది. కార్డియాక్ సింకోపి(Cardiac syncope)తో బాధపడుతున్న 77 సంవత్సరాల వయసు కలిగిన వరంగల్ నివాసికి అత్యంత క్లిష్టమైన తవి శస్త్రచికిత్సను విజయవంతంగా మెడికవర్ వైద్య బృందం చేసింది. అత్యంత క్లిష్టమైన గుండె చికిత్సలను చేయటంలో సుప్రసిద్దులైన సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్(Cardiologist) డాక్టర్ ఏ. శరత్ రెడ్డి నేతృత్వంలో మెడికవర్ హాస్పిటల్ వరంగల్ లో ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రవణ్ కుమార్, సీ టీవీఎస్, డాక్టర్. సృజన్ అల్లాడి, అనస్థీషియా(Anesthesia), డాక్టర్ అవనీష్ ఎస్ బృందం ఈ చికిత్సలో పాలు పంచుకొంది.

ఈ చికిత్స యొక్క క్లిష్టతను మెడికవర్ హాస్పిటల్ లో సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ , క్యాత్ ల్యాబ్, సీ టీ ఓ & కాంప్లెక్స్ కరొనరీ ఇంటర్వెన్షన్ డైరెక్టర్ డాక్టర్ ఏ. శరత్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ రోగి అత్యంత క్లిష్టమైన కార్డియాక్ సింకోపితో బాధ పడుతున్నారు. ఆయన గుండె లయ సక్రమంగా లేకపోవడం తో పాటుగా ఆయన గుండె యొక్క రక్త నాళాలు పూడుకు పోవటం, హార్ట్ వాల్వ్ లో అవరోధాలు వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఈ తరహా సమస్యలు కలిగిన వారికి వాల్వ్స్ వేయటంతో పాటుగా బైపాస్ కూడా చేయాల్సి ఉంటుంది. అయితే అతని ఆరోగ్య పరిస్థితి కారణంగా తవి, పీ టి సీ ఏ లను ఒకేసారి చేశాము. ఈ తరహా చికిత్సలకు నైపుణ్యం, అత్యాధునిక మౌలిక సదుపాయాలు అవసరమవుతాయి. వరంగల్ లో తొలిసారి విజయవంతంగా ఈ శస్త్రచికిత్స చేయడం సంతోషంగా ఉంది అని అన్నారు.

మెడికవర్ హాస్పిటల్ వరంగల్ లో ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్. శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ.. గత ఆరు నెలలుగా సింకోపి ఎటాక్ తో రోగి సతమతమవుతున్నారు. పలు హాస్పిటల్ లో ఆయన చూపించుకోవడం జరిగింది. చివరగా మెడికవర్ కు ఆయన వచ్చారు. రోగి యొక్క స్థితి చూసి తొలుత 2డి ఎకో చేసాము. అందులో సివియర్ అయోర్టిక్ స్టినోసిస్ అని తేలింది. అనంతరం అంజియోగ్రామ్(Angiogram)  చేసిన తర్వాత రోగికి గుండె రక్త నాళాలు, ఇతర సమస్యలు బయటపడ్డాయి. అతనికి సిటీ అంజియోగ్రామ్ ను తవి ప్రోటోకాల్ తో చేయడం జరిగింది. ఈ మినిమల్ ఇన్వాసివ్ ప్రొసీజర్ వల్ల రోగి త్వరగా కోలుకున్నారు. రోగి ఆరోగ్యం నిలకడగా ఉండగా డిశ్చార్జ్ చేసాము. తదుపరి మూడు ఫాలో అప్ లలో రోగికి ఎలాంటి సమస్యలు రాలేదు. మొట్టమొదటిసారిగా వరంగల్ లో పీ టీ సీ ఏ అండ్ తావి ప్రొసీజర్ ఒకటేసారి మన మెడికవర్ హాస్పిటల్ లో చేయడం జరిగింది అని అన్నారు.


Similar News