బస్సు సౌకర్యం కల్పించాలని రోడ్డుపై విద్యార్థులు రాస్తారోకో

బస్సు సౌకర్యం కల్పించాలని మండలంలోని మునిగలవీడు

Update: 2024-09-12 11:45 GMT

దిశ, నెల్లికుదురు : బస్సు సౌకర్యం కల్పించాలని మండలంలోని మునిగలవీడు హై స్కూల్ కు చెందిన విద్యార్థులు రోడ్డుపై గురువారం నిరసనగా రాస్తారోకో నిర్వహించారు. భారీ వర్షాలతో బంజర నుంచి మునిగల వేడి వరకు రోడ్డు గుంతల మయంగా మారిన వలన ఆర్టీసీ బస్సు నిలిపి వేయడంతో బంజర ,సింగారం, బోజ్జన్నపేట భీమ్లా తండా, నుంచి వస్తున్న విద్యార్థులకు నడిచి రావడం వలన విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

గతంలో ఆర్టీసీ అధికారులకు తెలియజేసిన రోడ్డు రవాణా అధికారులకు తెలియజేసిన రోడ్డును పట్టించుకోకపోవడం లేదనే విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.ఈ సందర్భంగా సీపీఎం నాయకులు ఇసంపెల్లి సైదులు విద్యార్థులకు మద్దతు తెలిపి మాట్లాడుతూ తక్షణమే ఆర్టీసీ, ఆర్ అండ్ బి అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణం చేపట్టి విద్యార్థుల సౌకర్యార్థం బస్సు నడిపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఇసంపేల్లి పవన్ ,సిద్దు, వంశీ, జీవన్ ,అమూల్య, శ్వేత, స్నేహిత, తదితర పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.


Similar News