'ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి బినామీల మొరం దందాను అరికట్టాలి'

పరకాల ఎమ్యెల్యే చల్లా ధర్మారెడ్డి బినామీల పేరుతో కాకతీయ ప్రధాన కాలువ, డిబియం...KU Student Leaders hits out at MLA Challa Dharma Reddy

Update: 2022-12-24 12:52 GMT

దిశ, గీసుగొండ: పరకాల ఎమ్యెల్యే చల్లా ధర్మారెడ్డి బినామీల పేరుతో కాకతీయ ప్రధాన కాలువ, డిబియం 40 ఉప కాలువ యొక్క మట్టిని నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న మొరం దందాను అరికట్టాలని కేయూ విద్యార్థి సంఘాల జాక్ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం మండలములోని ఊకల్, వంచంగిరి గ్రామాల శివారులోని డిబియం 40 ఉపకాలువ పరిధిలోని మొరం తరలిస్తున్న ప్రాంతాన్ని జాక్ బృందం సందర్శించింది. అనంతరం జాక్ నాయకులూ మాట్లాడుతూ టెక్స్టైల్ పార్క్ అభివృద్ధి పేరిట 5000 క్యూబిక్ మీటర్ల అనుమతి పొంది 2 లక్షల క్యూబిక్ మీటర్లకు పైన మొరాన్ని అక్రమంగా తరలించారని ఆరోపించారు.

పరకాల నియోజకవర్గం ఎమ్యెల్యే చల్లా ధర్మారెడ్డి బినామీ అయిన కారుణ్య ఏజెన్సి నుండి దిలీప్ రెడ్డి అనే వ్యక్తి మొరంను అక్రమంగా తరలిస్తున్నా సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవటం లేదని అన్నారు. దీనిపై జిల్లా అధికారులు ప్రత్యేక కమిటీ వేసి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అన్ని అనుమతులతో మొరం తీస్తున్న తెలంగాణ ఉద్యమకారులపై కేసులు పెట్టిస్తూ, బెదిరింపులకు గురిచేస్తున్నారని అన్నారు. దీనిపై జిల్లా అధికారులు సత్వరమే స్పందించాలని, లేదంటే పెద్ద ఎతున ఆందోళన చేపడుతామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కేయూ జాక్ చైర్మన్ ఇట్టబోయిన తిరుపతి యాదవ్, పీడీఎస్ యూ రాష్ట్ర కార్యదర్శి ఇడంపాక విజయ్ కన్నా, టీజీవీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడ రంజిత కుమార్, పీడీఎస్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి మొగిలి వెంకట్ రెడ్డి, కన్నం సునీల్, టీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కాడపాక రాజేందర్, బీఎస్ఎఫ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు, జాక్ నేతలు వంశీ, రాకేష్, మధుకర్, సంతోష్, ప్రణయ్, రంజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News