కాకతీయ కాలంనాటి విగ్రహం లభ్యం..?
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని పాకాల వాగు ఒడ్డున అయోధ్యపురం ఎత్తిపోతల పంప్ హౌస్ లిఫ్ట్ ఇరిగేషన్ సమీపంలో పురాతనమైన కాకతీయుల కాలంనాటి తల లేకుండా ఉన్న విగ్రహం వాగులో అక్కడి స్థానిక రైతుల కంట పడింది.
దిశ, గూడూరు: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని పాకాల వాగు ఒడ్డున అయోధ్యపురం ఎత్తిపోతల పంప్ హౌస్ లిఫ్ట్ ఇరిగేషన్ సమీపంలో పురాతనమైన కాకతీయుల కాలంనాటి తల లేకుండా ఉన్న విగ్రహం వాగులో అక్కడి స్థానిక రైతుల కంట పడింది. ఆ విగ్రహం ఎక్కడి నుంచి అక్కడికి వచ్చింది. వాగులో వచ్చే నీటి ప్రవాహానికి కొట్టుకొని వచ్చిందా, లేదా కావాలని ఎవరైనా వ్యక్తులు ఇక్కడ విగ్రహాన్ని వదిలి వెళ్లారా అని గ్రామస్థులు చర్చించుకుంటున్నారు.