బీఆర్ఎస్ లో భారీ చేరికలు
వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అప్పల్రావుపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు గురువారం సాయంత్రం నర్సంపేట ఎమ్మెల్యే అభ్యర్థి పెద్ది.సుదర్శన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు.
దిశ, నెక్కొండ : వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అప్పల్రావుపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు గురువారం సాయంత్రం నర్సంపేట ఎమ్మెల్యే అభ్యర్థి పెద్ది.సుదర్శన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. పార్టీలో చేరినవారిలో వార్డ్ మెంబెర్ ముత్తినేని.రవి, మాజీ వార్డ్ సభ్యులు ముత్తినేని.కళ్యాణి, దుండి. కృష్ణమూర్తి, ముత్తినేని.రమేష్, రామారావు, దుర్గాప్రసాద్, వంశీ, సరిత, బిల్లా స్వరూప, గణేష్, రాకేష్ తదితరులకు పెద్ది పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా పెద్ది.సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ "బీఆర్ఎస్ పార్టీ సంక్షేమపథకాలే గెలిపిస్తాయని అన్నారు. దేశంలోనే రైతులకు ప్రమాద భీమా ఇచ్చే ఏకైక రాష్ర్టం తెలంగాణ అని అన్నారు. నియోజకవర్గంలో గ్రామాలన్ని గులాబీమయం అవుతున్నాయని అన్నారు. గెలుపు ఎప్పుడో ఖాయం అయ్యిందని ఇక భారీ మెజారిటీ కోసం ప్రయత్నమని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సంగని.సూరయ్య, ఎంపీపీ రమేష్ నాయక్, గ్రామపార్టీ అధ్యక్షుడు గుద్దేటి.దామోదర్, మండల నాయకులు యాసం.బాలకృష్ణ, కొయ్యడ.శ్రీనివాస్, రాజిరెడ్డి, సారంగపాణి, మాజీ సర్పంచ్ జవహర్ లాల్, యూత్ అధ్యక్షుడు శ్రవణ్, జంపయ్య, రామచంద్రు తదితరులు పాల్గొన్నారు.