Janagam Collector : తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలను పక్కాగా నిర్వహించాలి

ఈ నెల 17 వ తేదీన తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ సందర్భంగా

Update: 2024-09-12 12:25 GMT

దిశ, జనగామ: ఈ నెల 17 వ తేదీన తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ సందర్భంగా ఏర్పాట్లను పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ వివిధ శాఖలకు చెందిన అధికారులను ఆదేశించారు.ఈ నెల 17న జరగబోయే తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రోహిత్ సింగ్, డీసీపీ రాజ మహేంద్ర నాయక్ లతో కలిసి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ గురువారం నాడు, జిల్లాలోని సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మినీ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీన మన జిల్లా లో జరిగే తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఆలేరు శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య రానున్నట్లు తెలిపారు.

ఆ రోజున అన్ని పాఠశాలల్లో, కార్యాలయాల్లో ఉదయం 9:30 గంటల వరకు జాతీయ జెండాను ఎగురవేయాలన్నారు.అలాగే సమీకృత కలెక్టర్ కార్యాలయంలో ఉదయం పది గంటలకు ముఖ్య అతిధి చేతుల మీదుగా జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం , అమరులకు నివాళులు సమర్పించడం,పోలీసుల గౌరవ వందనం స్వీకరణ, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని, అందుకు గాను మినట్ టూ మినట్ ప్రోగ్రామ్ షెడ్యూల్ తయారు చేయాలని... కార్యక్రమాల కోసం తగిన ఏర్పాట్లు చేయాలని వివిధ శాఖల అధికారులకు కలెక్టర్ సూచించారు.ఈ సమీక్ష సమావేశంలో జనగామ ఏసీపీ పార్థసారథి, డీసీఎస్ఓ సరస్వతి, డీఎం సీఎస్ హాతీరామ్, కలెక్టరేట్ ఏఓ మన్సూర్, ఉద్యాన వన శాఖ అధికారి శ్రీధర్ రావు, సూపరింటెండెంట్ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.


Similar News