ఘ‌నంగా కొమురం భీం విగ్రహన్ని ఆవిష్కరించిన మంత్రి సీతక్క

ఆదివాసీల‌కు అత్మ‌గౌర‌వం, అస్తిత్వాన్ని క‌ల్పించిన పోరాట యోధుడు కోమురం భీం అని మంత్రి సీత‌క్క అన్నారు.

Update: 2024-10-24 15:09 GMT

దిశ‌, ఏటూరునాగారంః - ఆదివాసీల‌కు అత్మ‌గౌర‌వం, అస్తిత్వాన్ని క‌ల్పించిన పోరాట యోధుడు కోమురం భీం అని మంత్రి సీత‌క్క అన్నారు. గురువారం రోజున ఏటూరునాగారం మండ‌ల కేంద్రంలోని వై జంక్ష‌న్ వ‌ద్ద ఆదివాసీ, తుడుందెబ్బ అధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన కోమురం భీం విగ్ర‌హావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మాన్ని మంత్రి సీత‌క్క హ‌జ‌రైయి విగ్ర‌హావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ముందుగా ఐటీడీఏ కార్య‌ల‌యంలో కొమురం భీం విగ్ర‌హానికి పూల‌మాల‌లు వేసి ఘ‌నంగా నివాళుల్ప‌రించారు. ఆదివాసీ సంస్కృతి సంప్ర‌దాయాల‌తో నృత్యాలు చేస్తూ గేయాలు ఆల‌పిస్తూ ర్యాలీగా వై జంక్ష‌న్ వ‌ద్ద‌కు చేరుకున్నారు. జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న చేసి విగ్ర‌హ‌విష్క‌ర‌ణ అనంత‌రం మంత్రి సీత‌క్క మాట్లాడుతూ..కొమురం భీం లేక‌పోతే మ‌న ఉనికి ఉండెది కాద‌న్నారు. కొమురం భీం పోరాటంతోనే హ‌క్కులు సాధించ‌బ‌డ్డాయ‌న్నారు.

ఆయ‌న పోరాట స్పూర్తితోనే సాగిన ఉద్య‌మం వ‌ల్ల తెలంగాణ రాష్ట్రంసిద్దించిదన్నారు. నిజాం ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా గెరిల్లా పోరాటం చేసిన గొప్ప యోధుడు కొమ‌రం భీం అని, అడ‌విని జీవ‌నోపాధిగా చేసుకొన్న కొమురం భీం నిజాంల‌ను ఎదురించాడ‌ని అన్నారు. నిజాం సైనికుల‌కు వ్య‌తిరేకంగా ఆయుధాల‌తో పోరాటం చేసాడ‌ని, ప‌శువుల కాప‌ర్ల పై విధించిన సుంకానికి వ్య‌తిరేకంగా ఉద్య‌మించాడ‌ని, జ‌ల్ జంగీల్ జ‌మీన్ అనే నినాదంతో ఉద్య‌మించి వీర‌మ‌ర‌ణం పోందాడ‌ని కొనియాడారు. కొమ‌రం భీం అదివాసి అత్మ‌గౌరవ ప్ర‌తీక అని మంత్రి సీత‌క్క అన్నారు. అంతే కాకుండా ఐటీడీఏ ను బ‌లోపేతం చేస్తామ‌ని త్వ‌ర‌లోనే పాల‌క మండ‌లి స‌మావేశం నిర్వహిస్తామ‌ని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మాజీ ఏమ్మెల్యేల‌తో పాటు మాజీ ప్ర‌జా ప్ర‌తినిధ‌లు, తుడుందెబ్బ రాష్ట్ర, జిల్లా, మండ‌ల నాయ‌కులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, బ్లాక్ మండ‌ల గ్రామ నాయ‌కుల కార్య‌క‌ర్త‌లు త‌దిత‌రులు పాల్గొన్నారు.


Similar News