జలదిగ్బంధంలో గార్ల.. పలు గ్రామాల్లో రాత్రివేళ విద్యుత్ సరఫరా బంద్

గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గార్ల మండలంలో లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి

Update: 2024-09-01 06:17 GMT

దిశ గార్ల: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గార్ల మండలంలో లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. కాలువలు, చెరువులు పొంగడంతో వందలాది ఎకరాల పంట నీటి మునిగాయి. కొన్ని గ్రామాల్లో రాత్రివేళ విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. పాకాల ఏరు పొంగడంతో గార్ల-సత్యనారాయణపురం ప్రధాన రహదారి, బంధం వాగు పొంగడంతో గార్ల -డోర్నకల్, తొక్కుడు వాగు పొంగడంతో గార్ల-గోపాలపురం రాకపోకలు నిలిచిపోయాయి.


Similar News