'కబ్జా చేశానని నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా'
కబ్జా చేశానని నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా అని హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.
దిశ, హనుమకొండ టౌన్ : కబ్జా చేశానని నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా అని హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. రేపు ఉదయం ఎనిమిది గంటలకు భద్రకాళి దేవాలయం వద్దకు కుటుంబ సభ్యులతో వస్తా అని, వినయ్ భాస్కర్ కూడా కుటుంబ సభ్యులతో వచ్చి ప్రమాణం చేయాలి అని సవాల్ చేశారు. 37 సంవత్సరాల రాజకీయ జీవితంలో మొదటిసారి అవకాశం రాబోతుంది అని హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ఏనాడు ఒక్క తప్పు చేయలేదు అవకాశం వస్తుందంటే నిజస్వరూపాలు బయటపడుతున్నాయి అని, రాజకీయాల మీద విరక్తి చెందేలా కుట్రలు చేస్తున్నారు అన్నారు. వినయ్ భాస్కర్ ఎన్ని కేసులు మోపిన నిలదొక్కుకున్న, రాజేందర్ రెడ్డి అమ్ముడు పోతాడు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని అన్నారు.
కబ్జా చేశానని నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా అని అన్నారు. డబ్బులు తీసుకున్నట్లు, ఇతర పార్టీలకు అమ్ముడుపోయానని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా, నువ్వు మగాడివి అయితే నిరూపించు లేకుంటే నువ్వు ఎన్ని కబ్జాలు చేసావో నేను నిరూపిస్తా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మనిషి పుట్టుక పుడితే అక్కడికి వచ్చి నిరూపించాలి అని అన్నారు. నాపై మర్డర్ కేసు పెట్టి నన్ను, నా కుటుంబాన్ని రెండు నెలలు చాలా ఇబ్బందులు పెట్టారని అన్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. మళ్లీ అమ్ముడు పోతాడు అంటూ సెల్ ఫోన్ లో మా వాళ్లే కొంతమంది సందేశాలు పంపిస్తున్నారు. యూనివర్సిటీ గేట్ ఎదుట చెప్పులదండ కట్టి కూర్చుంటా అని , యూనివర్సిటీ ప్రొఫెసర్లు, విద్యార్థులతో చర్చించి ఎవరు కబ్జా చేశారు అక్కడే తేల్చుకుందాం అన్నారు.
నాపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారి పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తా అని, గత ఎన్నికల్లో రేవూరి ప్రకాష్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖర్చులకోసం కొంత ఇచ్చారు. రాఘవరెడ్డి 30 సంవత్సరాల నుంచి నాకు పరిచయం, రెండు చేతులు జోడించి అడిగా నాకు సహకరించమని, ఆయన కూడా ఎవరికి టికెట్ వచ్చిన గెలిపించుకుంటాం అని చెప్పారు అంటూ అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, పోతుల శ్రీమాన్, టిపీసీసి ఎస్.సి.డిపార్ట్మెంట్ కో ఆర్ది నేటర్ ఎం.పి.ఆనంద్, జిల్లా మైనారిటీ సెల్ చైర్మన్ మీర్జా అజీజుల్లా బేగ్, జిల్లా ఐఎన్టీయూసీ చైర్మన్ కూర వెంకట్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ, జిల్లా ఎస్.సి. డిపార్ట్మెంట్ డాక్టర్ పి. రామకృష్ణ, జిల్లా ఓబీసీ డిపార్ట్మెంట్ చైర్మన్ బొమ్మతి విక్రమ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులూ తదితరులు పాల్గొన్నారు.