వరంగల్‌లో భారీ మట్టి గణపతి.. ఎన్ని ఫీట్లంటే..?

ఖైరతాబాద్ తరహాలో గణపతి నవరాత్రి ఉత్సవాలు

Update: 2024-09-07 16:16 GMT

దిశ, వరంగల్ : ఖైరతాబాద్ తరహాలో గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించేందుకు భద్రకాళి హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో 40 ఫీట్ల భారీ మట్టి గణపతిని ప్రతిష్టించామని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సంజీవ్ తెలిపారు. వరంగల్ నగరంలోని ఎల్లం బజార్ లో భద్రకాళి హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలో 40 ఫీట్ల భారీ మట్టి గణపతిని ప్రతిష్టించారు. 45 రోజులుగా ప్రత్యేకంగా ఒరిస్సా నుంచి ఎనిమిది మంది కార్మికులు శ్రమించి భారీ వినాయకుడిని తీర్చిదిద్దారని, ఉత్సవాలకు సుమారు రూ.30 లక్షల  ఖర్చు చేస్తున్నామని, నవరాత్రులలో ప్రతిరోజు పది మంది అర్చకులతో పారాయణాలు, గణపతి హోమం, అభిషేకాలు నిర్వహిస్తామని, భక్తులు దర్శించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ప్రతిరోజు మధ్యాహ్నం అన్నదానం కూడా ఏర్పాటు చేశామని భద్రకాళి హిందూ ఉత్సవ కమిటీ కన్వీనర్ సంజీవ్ తెలిపారు.


Similar News