ఆ నియోజకవర్గ ప్రజలకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం..

చాకలి ఐలమ్మ మనవడు, పాలకుర్తి మాజీ సర్పంచ్ చిట్యాల రామచంద్రం దశదినకర్మ, సంతాపసభ పాలకుర్తి మండల కేంద్రం రెడ్డి గార్డెన్ లో నిర్వహించారు.

Update: 2025-03-16 02:21 GMT
ఆ నియోజకవర్గ ప్రజలకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం..
  • whatsapp icon

దిశ, దేవరుప్పుల : చాకలి ఐలమ్మ మనవడు, పాలకుర్తి మాజీ సర్పంచ్ చిట్యాల రామచంద్రం దశదినకర్మ, సంతాపసభ పాలకుర్తి మండల కేంద్రం రెడ్డి గార్డెన్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి , నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి పాల్గొని చిట్యాల రామచంద్రం చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిట్యాల రామచంద్రం పాలకుర్తి గ్రామానికి ఎంతో సేవ చేసిన గొప్ప నాయకుడు అన్నారు. ఆయన ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేశారని, ఆయన నాయకత్వంలో పాలకుర్తి గ్రామం అభివృద్ధి పథంలో ముందుకు సాగిందని అన్నారు. పాలకుర్తి ప్రజల మన్ననలను పొందిన నాయకునిగా ఆయన సేవలను గుర్తించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు, అనుచరులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని. పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయంగా ఉంటాయని తెలిపారు.

పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ చిట్యాల రామచంద్రం కాంగ్రెస్ పార్టీకి తక్కువ సమయంలోనే అత్యంత నమ్మకమైన నాయకుడిగా, ఆయన తన రాజకీయ జీవితం మొత్తం ప్రజాసేవకే అంకితం చేశారని అన్నారు. పాలకుర్తి గ్రామాభివృద్ధికి ఆయన చేసిన కృషి అమూల్యమైనదన్నారు. ఆయన తన పదవికాలంలో రైతులు, పేద ప్రజల కోసం నిరంతరం శ్రమించారని, ఆయన లేనిలోటును భర్తీ చేయడం అసాధ్యం. కానీ, ఆయన చూపిన మార్గంలో కొనసాగడం ద్వారా, ఆయన ఆశయాలను సాకారం చేయడం ద్వారా నిజమైన గౌరవం అర్పించగలం. ఆయన కుటుంబానికి, మిత్రులకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందనీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, వివిధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, రామచంద్రం కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పాల్గొని నివాళులు ఘటించారు.


Similar News