బయ్యారం చెరువు లోకి భారీగా వరద నీరు"

మండలంలోని కాకతీయులు నాటి పెద్ద చెరువులో నీరు 6 అడుగులు నిల్వ ఉండగా మే మాసంలో వచ్చిన అకాల వర్షాలతో 9 అడుగులు నీరు చేరుతుంది.

Update: 2024-07-10 04:57 GMT

దిశ, బయ్యారం: మండలంలోని కాకతీయులు నాటి పెద్ద చెరువులో నీరు 6 అడుగులు నిల్వ ఉండగా మే మాసంలో వచ్చిన అకాల వర్షాలతో 9 అడుగులు నీరు చేరుతుంది. గత రెండు, మూడు రోజులుగా కురుస్తున్న అకాల వర్షానికి ఏజెన్సీ నుండి మసి వాగు, పాకాల వాగు కొంగరవాగు నుంచి భారీగా వరద నీరు 11.5 అడుగుల నీరు, పదిహేను ఫీట్లకు చేరింది. మరో రెండు రోజులు ఏజెన్సీలోని ఎగువన అటవీ ప్రాంతంలో వర్షం పడితే వాగుల నుంచి వరద నీరు 1.5 అడుగుల నీరు పూర్తి స్థాయి నీటి మట్టం మంగళవారం 16.5 అడుగులకు చేరి బయ్యారం చెరువు అలుగు‌కు చేరువలో ఉంది. దీంతో బయ్యారం మండలంలోని రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ.. తమ పంట సాగు భూములను దుక్కులు దున్నుకునేందుకు సాగుకు సన్నద్ధమయ్యారు. కొంతమంది రైతులు వ్యవసాయ కూలీల కొరత నేపథ్యంలో వ్యవసాయ అధికారుల సలహా సూచన మేరకు పొడి దుక్కులలోనే వరి విత్తనం వెదజల్లే పద్ధతిలో గింజలు విత్తుకున్నారు.


Similar News