కోటి మంది మహిళలు కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క

రాష్ట్రంలోని కోటి మహిళలను కోటీశ్వరులుగా మార్చడానికి

Update: 2024-09-12 12:17 GMT

దిశ,ములుగు ప్రతినిధి: రాష్ట్రంలోని కోటి మహిళలను కోటీశ్వరులుగా మార్చడానికి మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందించడంతో పాటు మహిళలు 17 రకాల వ్యాపారాలు చేసుకోవడానికి ప్రభుత్వం రుణాలను మంజూరు చేస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి,గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క అన్నారు. గురువారం ములుగు జిల్లాలో పర్యటించిన సీతక్క ములుగు మండలం మల్లంపల్లి గ్రామంలోని ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా ఎస్ హెచ్ జి మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ మహాలక్ష్మి మిల్క్ పార్లర్ , కోమలి డిజిటల్ స్టూడియో బుక్ స్టాల్ జిరాక్స్ ఇంటర్నెట్ సెట్ సెంటర్, సునీత ఎంబ్రాయిడరీ వర్క్స్, సారీ సెంటర్ , శ్రీ వెంకటేశ్వర కిరాణం జనరల్ స్టోర్ లను ప్రారంభించడంతో పాటు రాంసింగ్ తండా లో ఒక కోటి 10 లక్షల, శివ తండా లో ఒక కోటి 20 లక్షలతొ నిర్మించిన బిటి రోడ్లు, జాకారం గ్రామంలో 28.25 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన డైరీ ఫామ్ ను ప్రారంభించారు.

అనంతరం జాకరం గ్రామంలో 28.25 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన పాల శీతలీకరణ కేంద్రం భవనాన్ని , ములుగు కేంద్రంలో 6 కొట్ల అంచనతో ములుగు- బుద్దారం రహదారిలో కి.మీ. 0/0 నుంచి 1/0 (ములుగు పట్టణములో) వరకు 4 వరుసల రహదారి నిర్మాణ పనులను,ములుగు మండలం పులిగుండు గ్రామంలో పులి గుండం నుంచి చింతకుంట వరకు 70 లక్షలతో నిర్మించిన బిటి రోడ్డును,జంగాలపల్లి - అంకన్న గూడెం రహదారి వెడల్పు చేయుట పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో మంత్రి సీతక్క మాట్లాడుతూ రాష్ట్రంలోని కోటి మహిళలను కోటీశ్వరులు గా మార్చడానికి మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందించడంతో పాటు మహిళలు 17 రకాల వ్యాపారాలు చేసుకోవడానికి ప్రభుత్వం రుణాలను మంజూరు చేస్తున్నదని,రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరా మహిళా శక్తి క్యాంట్లను మహిళా సంఘాల వారు ఏర్పాటు చేయడం కోసం రుణాలు మంజూరు చేసి ప్రారంభించడం జరిగిందని, జిల్లాలో 20 ఎకరాల స్థలంలో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసి మహిళలు ఒక అప్పగించడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వం వడ్డీలేని రుణాలను తీసుకుంటున్న మహిళలు సకాలంలో అప్పు చెల్లించాలని, తిరిగి పెద్ద మొత్తంలో అప్పు కోరిన మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. పలు రకాల వ్యాపారాలు చేసుకోవడానికి మహిళలకు డి ఆర్ డి ఏ అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి సూచనలు సలహాలు ఇవ్వాలని, మహిళలు బాగుంటేనే గ్రామాలు సమాజం బాగుంటుందని అభిప్రాయపడ్డారు. రాజకీయాలకు అతీతంగా ములుగు జిల్లాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి అన్ని పార్టీల నాయకులు ముందుకు రావాలని, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు సాగుతున్నారని అన్నారు.

ములుగు జిల్లాలో చాలా వేగంగా అభివృద్ధి చెందుతుందని సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ , మెడికల్ కాలేజీ కూడా తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్క మహిళ వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మన ప్రాంతంలో ఎలాంటి బిజినెస్ పెడితే అందరికీ ఉపయోగపడుతుందో అలాంటి వాటిని ఎంచుకోవాలని సూచించారు.భవిష్యత్తులో మల్లంపల్లి ప్రాంతం ఎంతగానో అభివృద్ధి చెందుతుందని రేపు రాబోయే కాలంలో యూనివర్సిటీ కూడా వస్తుందిని , డాక్టర్లు మెడికల్ స్టూడెంట్స్ అందరూ కూడా 10 కిలోమీటర్ల పరిధిలోనే ఉండటం జరుగుతుంది కాబట్టి వారికి కావలసిన అవసరాలు మన ప్రాంతంలోనే సౌకర్యవంతంగా లభ్యమవుతాయని పేర్కొన్నారు. జరగబోయే అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని మహిళలు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.రాష్ట్రంలో పేదరిక నిర్మూలననే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు పోతున్నదని, ప్రభుత్వ కల్పిస్తున్న అవకాశాలను మహిళలు సద్వినియోగం చేసుకొని ముందుకు సాగాలని కోరారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఇంచార్జీ సంపత్ రావు, ఆర్డీఓ సత్య పాల్ రెడ్డి, ట్రైబల్ వెల్ఫేర్, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ ఈఈలు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Similar News