ఆ ఊరిలో ఏడుగురికి ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలు.!
ఆ కష్టానికి ఫలితం దక్కింది. ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో పోటీ ప్రపంచంలో రేయింబవళ్ళు కష్టపడి మరిపెడ మండలం రాంపురం గ్రామంలోని నలుగురు మహిళలు,
దిశ, మరిపెడ : ఆ కష్టానికి ఫలితం దక్కింది. ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో పోటీ ప్రపంచంలో రేయింబవళ్ళు కష్టపడి మరిపెడ మండలం రాంపురం గ్రామంలోని నలుగురు మహిళలు, ముగ్గురు పురుషులు ఇటీవల ప్రకటించిన డీఎస్సీ ఫలితాల్లో ఉద్యోగాలు సాధించారు. అందులో ఒకే ఇంటి నుంచి భార్య భర్తలైన ( రాంపల్లి శ్రావణ్ - చైతన్య )(ఎస్జీటీ)ఇద్దరికి ఉద్యోగాలు రాగా వారి కుటుంబం ఆనందంలో మునిగిపోయాయి. మేకల సునీత(ఎస్జీటీ), దుబ్బకుల స్వప్న (ఎస్జీటీ),ఈరగాని రంజిత్ (ఎస్జీటీ), బోర రోషా కృష్ణ (ఎన్జీటీ), కృష్ణవేణి(స్కూల్ అసిస్టెంట్ )లు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. మొత్తం రాంపురం గ్రామం నుండి ఏడుగురికి ప్రభుత్వ ఉద్యోగాలు లభించడంతో వారి వారి కుటుంబ సభ్యులు,గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తూ అభినందించారు.