పదవతరగతి వార్షిక పరీక్షలు రాసే విద్యార్ధులకు గుడ్ న్యూస్..

10వ తరగతిలో ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం "గౌతమ్ జూనియర్ కళాశాల" 25 మంది విద్యార్థులకు రూ. 20 లక్షల మెరిట్ స్కాలర్షిప్ అవార్డు అందిస్తున్నారు.

Update: 2023-05-06 16:24 GMT

దిశ, హనుమకొండ టౌన్ : 10వ తరగతిలో ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం "గౌతమ్ జూనియర్ కళాశాల" 25 మంది విద్యార్థులకు రూ. 20 లక్షల మెరిట్ స్కాలర్షిప్ అవార్డు అందిస్తున్నారు. ఇంటర్మీడియట్ లో మంచి కళాశాలలో అడ్మిషన్ కోసం ఎదురుచూస్తున్నారా ? అయితే “గౌతమ్ జూనియర్ కాలేజీ" వారు నిర్వహిస్తున్న స్కాలర్షిప్ టెస్ట్ లో మీ ప్రతిభను రుజువు చేసుకొండి. తేది : 10-05-2023 బుధవారం రోజు ఉదయం 10 గంటలకు పదవ తరగతి వార్షిక పరీక్షలు రాసిన విద్యార్థుల కోసం "గౌతమ్ జూనియర్ కళాశాల" మెరిట్ స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలో ఉత్తమ ర్యాంక్ సాధించిన మొదటి 5 విద్యార్థులకు ఐఐటీ & నీట్ ( ప్రైమ్ బ్యాచ్)లో, తరువాత 5 ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఇంటర్ & ఎంసెట్ ( లేయో బ్యాచ్ )లో, తరువాత 5 ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఇంటర్ ( జెనరల్ బ్యాచ్)లో మొత్తం 15 మంది విద్యార్థులకు రూ. 20 లక్షల విలువైన 2 సంలు ఐఐటీ & నీట్, ఎంసెట్, ఇంటర్ లలో హాస్టల్తో కూడిన విద్యను పూర్తిగా ఉచితంగా ఇచ్చుటకు "గౌతమ్ జూనియర్ కాలేజి" మీ ముందుకు వస్తున్నది. కావున 10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థులు ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని గౌతమ్ జూనియర్ కాలేజ్ డైరెక్టర్ అంబిర శ్రీకాంత్ తెలిపారు.

స్కాలర్షిప్ టెస్టు రాయబోయే విద్యార్థులకు సూచనలు..

ఏప్రిల్ 2023 10th పరీక్ష రాసిన విద్యార్థులందరూ అర్హులు, పరీక్ష రాయు విద్యార్థులు తేది : మే 10 బుధవారం ఉదయం 9 గంటలలోపు 10th హల్ టికెట్, ఆధార్ కార్డ్, జిరాక్స్ తో కాలేజి ఆఫీస్ లో మీ పేరు రిజిస్ట్రేషన్ చేసుకొగలరు లేదా 9393444808 నెంబర్కు వాట్సప్ చేయగలరు. స్కాలర్షిప్ టెస్టు 10th క్లాస్ సిలబస్ పై మ్యాథ్స్ 40 మార్కులు, ఫిజిక్స్ 20 మార్కులు, కెమిస్ట్రీ 20 మార్కులు, బయోలాజికల్ సైన్స్ 20 మార్కులు మొత్తం 100 ప్రశ్నలు, 100 మార్కులు మల్టిపుల్ ఛాయిస్ , ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో పరీక్ష నిర్వహించబడును. పరీక్ష సమయం రెండు గంటలు ఉంటుందని తెలిపారు.

పరీక్ష నిర్వహించు సెంటర్..

గర్ల్స్ కు గౌతమ్ జూనియర్ కాలేజి, నియర్ ఎస్వీఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ భీమారం, హనుమకొండ, ఫర్ బాయ్స్ గౌతమ్ జూనియర్ కాలేజి, ఔటర్ రింగ్ రోడ్ పలివేలుకుల హనుమకొండ మరింత సమాచారం కోసం 9393444808, 9100666804, 7995424666 ఈ నంబర్స్ ఫోన్ చేసి మాట్లాడగలరని విద్యార్థులకు, విద్యార్థుల తల్లితండ్రులను గౌతమ్ జూనియర్ కాలేజ్ డైరెక్టర్ అంబిర శ్రీకాంత్ కోరారు.

Tags:    

Similar News