నకిలీ విత్తనాలతో మోసం.. ఆదుకోవాలని షాప్ ఎదుట రైతుల ఆందోళన
నకిలీ విత్తనాలతో నష్టపోయిన తమను ఆదుకోవాలని కోరుతూ పరకాల
దిశ, పరకాల : నకిలీ విత్తనాలతో నష్టపోయిన తమను ఆదుకోవాలని కోరుతూ పరకాల పట్టణంలోని ఫర్టిలైజర్ షాపు ముందు రైతులు ఆందోళనకు దిగారు. ఫర్టిలైజర్ యజమాని మాడుగుల పాపిరెడ్డి శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన రైతులకు, ఆమని వరి సీడ్ విత్తనాలు పండిస్తే ఎకరానికి 45 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని రైతులకు చెప్పడంతో దాదాపు 70 ఎకరాల,కు విత్తనాలు తీసుకోవడం జరిగిందని, వరి నాట్లు వేసి కలుపులు తీసి వేలకు వేలు పెట్టుబడి పెట్టిన తర్వాత ఒకే పాదు,లో మూడు రకాలుగా గింజలు రావడంతో పూర్తిగా కల్తీ విత్తనాలు అంటగట్టినట్లు రైతులు గమనించి, వెంటనే వరి విత్తనాలు ఇచ్చిన షాపు యజమానికి సమాచారం ఇచ్చినా కూడా పట్టించుకోలేదని రైతులు తెలిపారు.
షాపు యజమాని కంపెనీ డీలర్లకు సమాచారం తెలుపుతానని రైతులను ఇంటికి పంపడంతో రైతులు వారి వారి గ్రామాలకు వెళ్లడం జరిగింది. ఆ రోజు నుండి ఇప్పటివరకు రైతులకు సరైన న్యాయం జరగలేదని ఈరోజు బుధవారం షాప్ ముందు రైతులు ధర్నాకు దిగి ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఎకరానికి రూ. 20,000 నుంచి 25 వేలు పెట్టుబడి పెట్టినట్లు పంట చేతికి వచ్చే తరుణంలో ఇలా మోసపోతామని అనుకోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా ఫర్టిలైజర్ షాప్ పై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని అధికారులను కోరారు.