తాయత్తుల పేరుతో మోసం.. అమాయకులే వారి టార్గెట్..
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపల్ పరిధి అంబేద్కర్ నగర్ ఏరియాలో సునీత, సరిత అనే ఇద్దరు మహిళలు తాయత్తుల పేరుతో అమాయకులను టార్గెట్ చేసి మోసం చేస్తున్నారు.
దిశ, డోర్నకల్: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపల్ పరిధి అంబేద్కర్ నగర్ ఏరియాలో సునీత, సరిత అనే ఇద్దరు మహిళలు తాయత్తుల పేరుతో అమాయకులను టార్గెట్ చేసి మోసం చేస్తున్నారు. సంతానలేమి, గర్భిణులకు తాయత్తులు కడితే వారి సమస్యలు నయమవుతాయని నమ్మిబలికి వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. వచ్చే వారి పరిస్థితిని బట్టి భయబ్రాంతులకు గురి చేస్తూ గాలి సోకింది, అందుకే సమస్య ఎదురైందని నమ్మిస్తారు. నిమ్మకాయలు, ఊదు, తాయత్తెలు సులువుగా అంటగడుతున్నారు.
పరిజ్ఞానం ఆకాశాన్నంటిన ప్రస్తుత కాలంలో తాయత్తులతో అమాయకులను మోసం చేయొద్దని శ్రేయోభిలాషులు వారించిన వినడం లేదని తెలిసింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి అమాయకులు మూఢనమ్మకాలతో తమ కష్టార్జితాన్ని కోల్పోకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞానవంతులు కోరుతున్నారు.