లబ్ధిదారుల ఖాతా నుంచి రైతు బీమా సొమ్ము మళ్లింపు..!

రైతు బీమా సొమ్ము స్థానిక విస్తరణాధికారి దారి మళ్లించి తన ఖాతాలో జమ చేసుకున్నాడంటూ జిల్లా వ్యవసాయ అధికారికి బాధితులు ఫిర్యాదు చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం గుండ్రాతి మడుగులో చోటుచేసుకుంది

Update: 2024-12-17 15:29 GMT

దిశ, మరిపెడ : రైతు బీమా సొమ్ము స్థానిక విస్తరణాధికారి దారి మళ్లించి తన ఖాతాలో జమ చేసుకున్నాడంటూ జిల్లా వ్యవసాయ అధికారికి బాధితులు ఫిర్యాదు చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం గుండ్రాతి మడుగులో చోటుచేసుకుంది. మరొకటి గేట్ తండాలో చోటు చేసుకుంది బాధితులు తెలిపిన వివరాల ప్రకారం… కురవి మండలం గుండ్రాతిమడుగు కు చెందిన కేతం లక్ష్మణ్, గేటుతండాకు చెందిన గిరిజన రైతు షేక్ హుస్సేన్ అకాల మృతి చెందాగా ఇరువురు నామినీలు స్థానికుల సహాయంతో రైతు బీమా కోసం దరఖాస్తు చేసుకున్నారు. అక్టోబర్ నెలలో కేతం లక్ష్మణ్ నామిని ఐనా వెంకటమ్మ ఖాతాలో నవంబర్ మాసం లో హుస్సేన్ నామిని అయినా ఇరానీ ఖాతాలో బీమా సొమ్ము జమయ్యాయి. రైతు బీమా డబ్బులు ఇప్పిస్తానని ఏఈఓ బానోత్ కళ్యాణ్ బ్యాంకు వద్దకు తీసుకెళ్లి కొన్ని సంతకాలు చేయించుకున్నాడని రేపు మాపు డబ్బులు పడతాయి అంటూ దాటవేస్తుండడంతో అనుమానం వచ్చి స్టేట్మెంట్ తీశామని వెంకటమ్మ ఖాతా నుంచి రూ. 5 లక్షల రూపాయలు, ఇరానీ ఖాతా నుంచి మూడు లక్షల రూపాయలను నెఫ్ట్ ద్వారా అతని ఖాతాలోకి మళ్లించుకున్నాడని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. నకిలీ చెక్కు ఇచ్చి త్వరలో డబ్బులు పడతాయంటూ మభ్యపెడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇదే విషయమై కురవి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు.

ఈ బీమా సొమ్ము మళ్లింపు వ్యవహారంపై లోతు విచారణ చేస్తున్నామని విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామని వ్యవసాయ అధికారి ఒకరు వివరణ ఇచ్చారు.


Similar News