విద్యుత్ విజిలెన్స్ దాడులు..రూ. 4.60 లక్షల బకాయి ఉన్న కేబుల్ ఆపరేటర్‌లు

మండలంలోని కమలాపురం పారిశ్రామిక ప్రాంతంలో విద్యుత్ విజిలెన్స్

Update: 2024-12-18 10:50 GMT

దిశ, మంగపేట : మండలంలోని కమలాపురం పారిశ్రామిక ప్రాంతంలో విద్యుత్ విజిలెన్స్ అధికారులు బుధవారం దాడులు నిర్వహించినట్లు ఏఈ సుబ్బరామ శర్మ తెలిపారు. విలేకర్లతో మాట్లాడుతూ కమలాపురం గ్రామంలోని కేబుల్ జియో కేబుల్ నెట్ వర్క్ 3477 సర్వీస్ నెంబర్ పై 4.60 లక్షల బకాయిలు ఉండడంతో విద్యుత్  కనెక్షన్ తొలగించినట్లు తెలిపారు. 12 డిసెంబర్ 2024 న స్కై విజన్ నెట్ వర్క్ నుండి దంతులూరి వెంకటేశ్వరరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కమలాపురం గ్రామంలో ఉమ్మడిగా బలరాం, మాధవాచారి, శ్రీనివాసు, ఉమాశంకర్ అనే వ్యక్తులు 10 సంవత్సరాలుగా కేబుల్ టీవీ ప్రసారాలు చేసి టీజీఎన్పీడీసీఎల్ కు సంబందించిన ఎల్ టీ విద్యుత్ లైను నుండి డిష్ ప్రసారాలకు సంబందించిన నోడ్స్, ఆంప్లీప్లేయర్స్, పవర్ పాస్ యూనిట్లకు అక్రమంగా విద్యుత్ సరఫరా చేసుకుంటూ వ్యాపారం చేసినట్లు అందిన ఫిర్యాదుతో డీపీఈ వింగ్ విజిలెన్స్ అధికారులు బుదవారం గ్రామంలో దాడులు నిర్వహించి 67 విద్యుత్ స్తంబాల నుంచి విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నట్లు గుర్తించినట్లు తెలిపారు.

ఈ విషయంలో గతంలో మంగపేటలో పని చేసిన ఏఈలు ఆలేటి శ్రీధర్, గుర్రం ప్రశాంత్ రెడ్డి, కృష్ణారావులకు ఫిర్యాదు చేసినప్పటికీ బాధ్యులపై చర్యలు తీసుకోలేదని ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఏఈ సుబ్బరామ శర్మ తెలిపారు. వారి ఫిర్యాదు మేరకు దాడులు నిర్వహించిన డీపీఈ విజిలెన్స్ వింగ్ అధికారులు ఈ విషయాన్ని విద్యుత్ శాఖ ఎస్ ఈ, డిఈ, ఏడిఈలకు సమాచారం అందించి 4 రోజుల సమయం ఇచ్చినట్లు తెలిపారు. ఈ విషయంలో స్కై విజన్ పిర్యాదు మేరకు జియో నెట్ వర్క్ యాజమాన్యానికి నోటీసులు అందజేశామని నాలుగు రోజుల్లో 4.60 లక్షల బకాయిలు చెల్లించని చో విద్యుత్ సరఫరా నిలిపి వేయనున్నట్లు తెలిపారు. దాడుల్లో స్థానిక విద్యుత్ అధికారులు పాల్గొన్నారు.


Similar News