పట్టు సాగుతో రైతులకు సిరుల పంట : కలెక్టర్ సత్య శారద

పట్టు సాగు ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు

Update: 2024-12-18 12:33 GMT

దిశ,గీసుగొండ: పట్టు సాగు ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించవచ్చని,ఆ దిశగా రైతులను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు. మండలంలోని దస్రు తండా గ్రామంలో పట్టు పరిశ్రమ సాగు షెడ్డు నిర్మాణాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సంప్రదాయ పంటలు వేసి నష్టపోకుండా ఆదాయం వచ్చే పట్టు సాగు చేపట్టాలని, గ్రామ రైతులు పంట మార్పిడి చేయాలని సూచించారు. పట్టు పరిశ్రమ అధికారులను,శాస్త్రవేత్తలను సంప్రదించి వారి సూచనల మేరకు పట్టు పురుగుల పెంపకంలో మెళకువలు పాటించాలని అన్నారు. కర్ణాటక రైతుల లాగ తక్కువ పెట్టుబడి తో అధిక లాభం పొందవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పట్టు పరిశ్రమ సంయుక్త సంచాలకులు అనసూయ సహాయ పట్టు పరిశ్రమ అధికారి అరవింద్, సంపత్, రాజు, రైతులు తదితరులు పాల్గొన్నారు.


Similar News