వరంగల్ నగరంలో నకిలీ కేటుగాళ్లు..

వరంగల్ మహానగరంలో మాయగాళ్లు అడ్డదారిలో ఎక్కువగా డబ్బులు దండుకునేందుకు ఏకంగా భవన నిర్మాణ రంగంలో వాడే ఎలక్ట్రికల్ వైర్స్, స్విచ్ లను బ్రాండెడ్ కాంపెనీలు అయినటువంటి పొలుఖ్యాబ్, ఫెనోలెక్స్, గోల్డ్ మెడల్ కంపెనీల ముసుగులో నకిలీవి అమ్ముతున్నారనే పక్కాసమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు, హన్మకొండ పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టగా ఈ నకిలీ వ్యాపారం బయటపడింది.

Update: 2024-12-18 04:37 GMT

దిశ, హన్మకొండ : వరంగల్ మహానగరంలో మాయగాళ్లు అడ్డదారిలో ఎక్కువగా డబ్బులు దండుకునేందుకు ఏకంగా భవన నిర్మాణ రంగంలో వాడే ఎలక్ట్రికల్ వైర్స్, స్విచ్ లను బ్రాండెడ్ కాంపెనీలు అయినటువంటి పొలుఖ్యాబ్, ఫెనోలెక్స్, గోల్డ్ మెడల్ కంపెనీల ముసుగులో నకిలీవి అమ్ముతున్నారనే పక్కాసమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు, హన్మకొండ పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టగా ఈ నకిలీ వ్యాపారం బయటపడింది. పొలుఖ్యాబ్, ఫెనోలెక్స్, గోల్డ్ మెడల్ కంపెనీలకు చెందిన ఎలక్ట్రికల్ వైర్స్, స్విచ్ లు లాంటి నకిలీలను అసలు వాటిగా నమ్మిస్తూ, అర్బుధ ఎలక్ట్రికల్స్ & సానిటరీ యజమాని అయిన కంతిలాల్ పెగడపల్లి డబ్బాలు సమీపంలో గల తన షాప్ లో విక్రయిస్తున్నారనే సమాచారంతో మంగళవారం టాస్క్ ఫోర్స్ పోలీసులు, హన్మకొండ పోలీసులు సంయుక్తంగా చేసిన ఆపరేషన్ లో రూ.16,34,900 విలువ గల వైర్స్ గుర్తించి సీజ్‌ చేశారు. దర్యాప్తులో భాగంగా ఎలక్ట్రికల్స్ యజమాని కంతి లాల్ విచారించగా పొలుఖ్యాబ్, ఫెనోలెక్స్, గోల్డ్ మెడల్ కంపెనీకి చెందిన వస్తువులకు మార్కెట్లో చాలా డిమాండ్ ఉన్నందున ఎక్కువగా డబ్బులు సంపాధించాలనే దురాశతో విక్రయిస్తున్నానని తెలిపినాడు. తదుపరి విచారణ నిమిత్తం నిందితున్ని, స్వాధీన పరుచుకున్న సామగ్రిని హన్మకొండ పోలీసులకు అప్పగించారు.

సుమారు 4 లక్షల 64 వేల విలువగల నకిలీ ఎలక్ట్రికల్ వైర్స్, స్విచ్ లు పట్టివేత..

వరంగల్ మహానగరంలో మాయగాళ్లు అడ్డదారిలో ఎక్కువగా డబ్బులు దండుకునేందుకు ఏకంగా భవన నిర్మాణ రంగంలో వాడే ఎలక్ట్రికల్ వైర్స్, స్విచ్ లను బ్రాండెడ్ కాంపెనీలు అయినటువంటి పొలుఖ్యాబ్, ఫెనోలెక్స్, పెంట కంపెనీల ముసుగులో నకిలివి అమ్ముతున్నారనే పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టగా ఈ నకిలీ వ్యాపారం బయటపడింది. పొలుఖ్యాబ్, ఫెనోలెక్స్, పెంట కంపెనీలకు చెందిన ఎలక్ట్రికల్ వైర్స్, స్విచ్ లు లాంటి నకిలీలను అసలు వాటిగా నమ్మిస్తు, కేయూ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెగడపల్లి డబ్బల్ లో సాయి గణేష్ ఎలక్ట్రికల్స్ యజమాని కలబి పుణ్మరం, శివ్ ఎలక్రీకల్స్ షాప్ యజమాని పురోహిత్ అనిల్ లకు చెందిన షాప్ లలో విక్రయిస్తున్నారనే సమాచారంతో మంగళవారం టాస్క్ ఫోర్స్ పోలీసులు చేసిన ఆపరేషన్ లో రూ. 4,64,507 విలువ గల వైర్స్ , స్విచ్ లు గుర్తించి సీజ్‌ చేశారు. దర్యాప్తులో భాగంగా సాయి గణేష్ & శివ్ ఎలక్ట్రికల్స్ యజమానులు కలభి పున్మరం, పురోహిత్ అనిల్ లను విచారించగా పొలుఖ్యాబ్, ఫెనోలెక్స్, పెంట కంపెనీకి చెందిన వస్తువులకు మార్కెట్లో చాలా డిమాండ్ ఉన్నందున ఎక్కువగా డబ్బులు సంపాధించాలనే దురాశతో విక్రయిస్తున్నామని తెలిపినారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితున్ని, స్వాధీన పరుచుకున్న సామగ్రిని కేయూ పోలీసులకు అప్పగించారు. ప్రతిభ కనబరిచిన టాస్క్‌ఫోర్స్‌ ఇన్స్‌స్పెక్టర్ ఎస్‌.రాజు, ఎస్‌.ఐ భాను ప్రకాశ్, సిబ్బంది ఏఎస్ఐ ఉప్పలయ్య, కానిస్టేబుల్స్ సురేష్, సురేందర్, సాంబరాజులను టాస్క్ ఫోర్స్, ఏసీపీ మధుసూదన్ అభినందించారు.


Similar News