రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ మృతి
టీ తాగడానికి ట్రాక్టర్ డ్రైవర్ రోడ్డు దాటుతుండగా కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మండలంలోని ధర్మారం వద్ద చోటుచేసుకుంది
దిశ, గీసుగొండ: టీ తాగడానికి ట్రాక్టర్ డ్రైవర్ రోడ్డు దాటుతుండగా కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మండలంలోని ధర్మారం వద్ద చోటుచేసుకుంది. గీసుగొండ సీఐ ఎ.మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం... ఖిలా వరంగల్ మండలం నక్కలపల్లికి చెందిన పసునూరి కుమారస్వామి (47)అనే వ్యక్తి ఫోర్ట్ రోడ్డులో గల మణికంఠ బ్రిక్స్ లో ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. మంగళవారం ఉదయం నాలుగు గంటలకు సిమెంట్ ఇటుకలు నర్సంపేటలో వేయడానికి ట్రాక్టర్ తో వెళుతూ మార్గం మధ్యలో టీ తాగడానికి రోడ్డు దాటుతుండగా నర్సంపేట వైపు నుండి వరంగల్ వైపు వస్తున్న టాటా జనని గూడ్స్ బండి నడుపుతున్న డ్రైవర్ అతివేగంగా వచ్చి పసునూరి కుమారస్వామికి ఢీకొట్టాడు. కుమారస్వామి కుడికాలు వీరిగి, తలకు బలమైన గాయమై మృతి చెందాడని మృతుడి భార్య పసునూరి లక్ష్మి గీసుకొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వగా, గూడ్స్ బండి డ్రైవర్ రామకృష్ణ ప్రధాన్ పై కేసు నమోదు చేసినట్లు సీఐ మహేందర్ తెలిపారు.