మనీహంటింగ్ ఛాలెంజ్ యూ ట్యూబర్ రిమాండ్

సోషల్ మీడియాలో రేటింగ్, లైకుల కోసం సమాజాన్ని, యువతను తప్పుదోవ పట్టించే చట్ట వ్యతిరేకమైన వీడియోలు, రీల్స్ చేసి జైలు పాలు కావద్దని రాచకొండ కమిషనరేట్ ఉప్పల్ ఏసీపీ చక్రపాణి సూచించారు.

Update: 2024-12-18 11:08 GMT

దిశ, ఘట్కేసర్ : సోషల్ మీడియాలో రేటింగ్, లైకుల కోసం సమాజాన్ని, యువతను తప్పుదోవ పట్టించే చట్ట వ్యతిరేకమైన వీడియోలు, రీల్స్ చేసి జైలు పాలు కావద్దని రాచకొండ కమిషనరేట్ ఉప్పల్ ఏసీపీ చక్రపాణి సూచించారు. ఘట్కేసర్ పోలీస్స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చక్రపాణి మాట్లాడుతూ... ఈనెల 17న ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై రాయలపురం భానుచందర్ అనే యుట్యూబర్ మనీ హంట్ ఛాలెంజ్ పేరుతో డబ్బును చెట్ల పొదల్లో విసిరేస్తూ రీల్స్ చేసి యువతను రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియా(ఇంస్టాగ్రామ్, యూట్యూబ్)లో పోస్ట్ చేసాడు.

    దీనివల్ల ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణికులకు ఇబ్బంది కలగడమే కాకుండా ఫేక్ నోట్లను చెట్ల పొదలలో విసిరేసి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడు. అంతే కాకుండా జాతీయ రహదారుల చట్టాన్ని ఉల్లంఘించాడు. ఔటర్ రింగ్ రోడ్ హైవే పెట్రోలింగ్ వెహికల్ ఇన్చార్జ్ బండారు శ్రీరాములు ఫిర్యాదు మేరకు భానుచందర్ పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు ఏసీపీ చెప్పారు. యువత ఎవరూ కూడా ఇలాంటి తప్పుడు వీడియోలను స్ఫూర్తిగా తీసుకోవద్దని సూచించారు. సమావేశంలో ఘట్కేసర్ సీఐ పరశురాం, ఎస్సై శేఖర్ పాల్గొన్నారు. 


Similar News