ములుగు జిల్లా కలెక్టర్ పేరుతో ఫేక్ మెసేజ్ లు
ములుగు జిల్లా కలెక్టర్ దివాకర పేరుతో సైబర్ నేరగాళ్లు ఫేస్‌బుక్‌లో నకిలీ ఖాతా సృష్టించారు.
దిశ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా కలెక్టర్ దివాకర పేరుతో సైబర్ నేరగాళ్లు ఫేస్‌బుక్‌లో నకిలీ ఖాతా సృష్టించారు. ఈ ఖాతాను ఉపయోగించుకుని పలువురి నుంచి డబ్బు వసూలు చేసేందుకు సైబర్ నేరగాళ్లు యత్నిస్తున్నారు. కలెక్టర్ దివాకర టి. ఎస్. పేరు, ఫొటోతో ఫేస్ బుక్ ఐడీని సృష్టించి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వారి ఖాతాలకు ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపిస్తున్నారు. వారు అక్సెప్ట్ చేసిన అనంతరం మెస్సెంజర్ లో పలువురికి మేసేజ్‌లు పంపించారు. దీన్ని గమనించిన కలెక్టర్ తక్షణమే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన అసలు ఫేస్‌బుక్ అకౌంట్ ద్వారా అందరిని అప్రమత్తం చేశారు. తన పేరుతో ఎవరూ డబ్బులు అడిగిన ఇవ్వొద్దని కలెక్టర్ సూచించారు.”పై నంబర్ మోసపూరితమైనది, దయచేసి జవాబు ఇవ్వకండి. వీలైనంత త్వరగా బ్లాక్ చేయమని కలెక్టర్ దివాకర ప్రతి ఒక్కరిని కోరారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సైబర్ కేటుగాళ్ల ఆట కట్టించేందుకు సిద్ధమయ్యారు.