అందరికీ అందుబాటులో సీఈఐఆర్ పోర్టల్..

చోరీకిగురైన మొబైల్ ఫోన్‌లను ట్రాక్ చేసే కొత్త విధానం సీఈఐఆర్ సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR) పోర్టల్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం తెలిపారు.

Update: 2023-04-19 15:46 GMT

దిశ, ములుగు ప్రతినిధి : చోరీకిగురైన మొబైల్ ఫోన్‌లను ట్రాక్ చేసే కొత్త విధానం సీఈఐఆర్ సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR) పోర్టల్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం తెలిపారు. (సీఈఐఆర్) సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న, దొంగిలించబడిన మొబైల్ ఫోన్‌లను ట్రాక్ చేయడంలో సహాయపడుతుందని అన్నారు. ప్రస్తుత జీవన శైలిలో మొబైల్ ఫోన్ అత్యంత కీలక పరికరం అయ్యిందని తెలిపారు. ఏదైనా సమాచారం తెలుసుకోవాలన్న నగదు లావాదేవీలు చేయాలన్న మొబైల్ ఫోన్ పైనే ఆదారపడేంతగా ప్రాధాన్యం సంతరించుకున్న మొబైల్ ఫోన్ ఎక్కడైనా పోగొట్టుకున్న /చోరికి గురైతే పరిస్తితి ఎలాఉంటుందో ఊహించనవసరం కష్టమేనని అన్నారు.

పోయిన ఫోన్ లను వెతికి పెట్టడానికి జిల్లా పోలీస్ యంత్రాంగం ఇప్పటికే పలురకాల సాంకేతిక అంశాలను ఉపయోగిస్తుందని అయితే కొత్తగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన ఈ సీఈఐఆర్ అనే అప్లికేషన్ ద్వారా చరవాణి (సెల్ ఫోన్) ఎక్కడైనా పోగొట్టుకున్న లేదా చోరికి గురైనా ఆ చరవాణిలను వెతికి పట్టుకోవడానికి సీఈఐఆర్ పోర్టల్ దోహదపడుతుందని అన్నారు. కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని "సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్" (సీఈఐఆర్) విధానాన్ని ప్రవేశపెట్టింది.

ఇందుకోసం www.ceir.gov.in అనే వెబ్సైట్లో లాగిన్ కావాలి. అందులో రిక్వెస్ట్ ఫర్ బ్లాకింగ్ లాస్ట్ / స్టోలెన్ మొబైల్ లింక్ కనబడుతుంది, దానిపై క్లిక్ చేయాలి. పోయిన చరవాణిలోని నెంబర్లు, ఐఎంఈఐ నెంబర్లు, కంపెనీ పేరు, మోడల్, కొన్న బిల్లు అప్లోడ్ చేయాలి. మొబైల్ ఏ రోజు, ఎక్కడ పోయింది, జిల్లా, రాష్ట్రం, పోలీస్ స్టేషన్ పరిధి, ఫిర్యాదు చేసిన వివరాలు నమోదు చేయాలి, చివరగా వినియోగదారుడు పేరు, చిరునామా, గుర్తింపు కార్డు, ఈమెయిల్ ఐడి, ఓటిపి కోసం మరో మొబైల్ నెంబరు ఇవ్వాలి. ఇదంతా పూర్తయిన తర్వాత ఒక ఐడి నెంబర్ వస్తుంది.

ఈఐడి ఆధారంగా దర్యాప్తు ప్రక్రియతో పాటు మొబైల్ దొరికిన వివరాలు తెలుసుకోవచ్చు అని, మొబైల్ ఏ కంపెనీదైనా సీఈఐఆర్ విధానం దాని పనిచేయకుండా చేస్తుంది అని, దాంతో పాటు కేసు చేదనలో పోలీసులకు ఉపయోగపడుతుంది అని తెలిపారు. మొబైల్ దొరికిన తర్వాత వినియోగదారుడు అదే వెబ్సైట్ లోకి వెళ్లి అన్ బ్లాక్/ ఫౌండ్ మొబైల్ లింకు పై క్లిక్ చేయాలి అని, తర్వాత ఐడి నమోదు చేయగానే అన్ బ్లాక్ అవుతుంది అని తెలిపారు. మొబైల్ ఫోన్ పోయిన వెంటనే ఆ పరిధిలోని పోలీసులకు సమాచారం అందించాలని, ఐఎంఈఐ ఆధారంగా దర్యాప్తు చేసి కేంద్రం ప్రవేశపెట్టిన సీఈఐఆర్ వెబ్సైట్లో పూర్తి సమాచారాన్ని నమోదు చేస్తే.. త్వరగా మొబైల్ ఫోన్ దొరకడానికి అవకాశం ఉంటుందని అన్నారు.

Tags:    

Similar News