వార్తలను ప్రజలకు అందించడంలో ముందంజలో ‘దిశ’ : తిరుపతి రెడ్డి

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణం ఎమ్మెల్యే క్యాంప్

Update: 2024-12-29 08:31 GMT

దిశ,తొర్రూర్: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో,తొర్రూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమాన్ల తిరుపతి రెడ్డి దిశ దినపత్రిక 2025 నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా హనుమాన్ల తిరుపతి రెడ్డి మాట్లాడుతూ, దిశ తెలుగు దినపత్రిక ప్రజలకు వేగవంతమైన, నాణ్యమైన వార్తలను అందించడంలో అగ్రగామిగా నిలుస్తోందని ప్రశంసించారు. దిశ డైనమిక్ వార్తలు ప్రజలకు అందించడంలో ముందంజలో ఉంది. దిశ దినపత్రిక ప్రభుత్వ ప్రజల మధ్య వారధిగా పని చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సుంచు సంతోష్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్, సీనియర్ నాయకులు పెదగాని సోమయ్య,ఇతర స్థానిక నాయకులు, అధికారులు,ప్రజలు పాల్గొన్నారు.


Similar News