పత్రిక రంగంలో దూసుకుపోతున్న దిశ
ములుగు జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో మంగళవారం ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ దిశ దినపత్రిక క్యాలెండర్ 2025 ను ఆవిష్కరించారు
దిశ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో మంగళవారం ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ దిశ దినపత్రిక క్యాలెండర్ 2025 ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పత్రికా రంగంలో దిశ దినపత్రిక ట్రెండ్ సెట్టర్ గా మారిందని, అతి తక్కువ కాలంలో పాఠకుల ఆదరణ పొందిన పత్రికగా నిలిచి పత్రిక రంగంలో దిశ దినపత్రిక దూసుకుపోతుందని అభిప్రాయపడ్డారు. వచ్చే సంవత్సరంలో మరింత అభివృద్ధి చెంది ప్రథమ స్థానంలో నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో దిశ ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గాదే సుమన్, ఎన్టీవీ రిపోర్టర్ హరీష్ పాల్గొన్నారు.