ట్రెండ్ సెట్టర్ దిశ...
రెండు తెలుగు రాష్ట్రలలో జర్నలిజంలో దిశ దినపత్రిక ట్రెండ్ సెట్టర్‌గా మారిందని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు.
దిశ,పాలకుర్తి/తొర్రూరు : రెండు తెలుగు రాష్ట్రలలో జర్నలిజంలో దిశ దినపత్రిక ట్రెండ్ సెట్టర్‌గా మారిందని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. ఖచ్చితత్వంతో కూడిన వాయు వేగంతో వార్తలను పాఠకులను అందించడం అభినందనీయమన్నారు. నిజాలను నిర్భయంగా జనాల్లోకి తీసుకెళ్తోందని, ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా నిలుస్తోందని కొనియాడారు. చాలా తక్కువ సమయంలోనే లక్షలాది మంది పాఠకుల ఆదరణను సంపాదించుకుందని అన్నారు. నూతన సంవత్సరం దిశ క్యాలెండర్‌ను శుక్రవారం పాలకుర్తి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ....ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తున్న దిశ పత్రికా యాజమాన్యాన్ని అభినందించారు. ఎప్పటికప్పుడు డైనమిక్ ఎడిషన్ల ద్వారా తాజా సమాచారం అందించడం ద్వారా పాఠకులను దిశ సంపాదించుకుంటోందని అన్నారు. క్యాలెండర్ ఆవిష్కరణలో పాలకుర్తి నియోజకవర్గం ఆర్సీ ఇన్చార్జి పోల్ రాజు, దేవరప్పల రిపోర్టర్ గోవర్ధన్, కొడకండ్ల రిపోర్టర్ శేఖర్, పెద్దవంగర రిపోర్టర్ బాలాజీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.