హాస్టల్ లో ఉండటం ఇష్టం లేక రైలు ఎక్కి పారిపోయిన విద్యార్థి.!

హాస్టల్ లో ఉండటం ఇష్టం లేక ఓ విద్యార్థి హాస్టల్ నుంచి పారిపోయిన ఘటన మరిపెడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

Update: 2024-12-31 14:41 GMT

దిశ, మరిపెడ : హాస్టల్ లో ఉండటం ఇష్టం లేక ఓ విద్యార్థి హాస్టల్ నుంచి పారిపోయిన ఘటన మరిపెడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం డోర్నకల్ మండలంలోని లింబియా తండాకు చెందిన బాదావత్ అనిల్ అనే పదవ తరగతి విద్యార్థి టి డబ్ల్యూ ఆర్ ఎస్ అనెపురం హాస్టల్ లో చదువుతున్నాడు.హాస్టల్ లో ఉండటం ఇష్టం లేక సోమవారం రోజున హాస్టల్ నుంచి పారిపోయి మహబూబాబాద్ లో రైలు ఎక్కి వెళ్తుండగా ఇన్ఫర్మేషన్ అందుకున్న మరిపెడ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి అనిల్ ను పట్టుకొని వారి తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది. ప్రత్యేక శ్రద్ధ కనబరిచి మా కుమారుని మాకు అప్పగించినందుకు ఆ తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.


Similar News