‘దిశ’ ఎఫెక్ట్.. తాగునీటి సమస్య పరిష్కారం

మున్సిపాలిటీ పరిధిలోని ట్రంకు తండాలో గిరిజనులు తాగునీటి కోసం

Update: 2024-07-04 14:29 GMT

దిశ,డోర్నకల్ : మున్సిపాలిటీ పరిధిలోని ట్రంకు తండాలో గిరిజనులు తాగునీటి కోసం వాటర్ ట్యాంకర్లపై ఆధారపడుతూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని గురువారం దిశ దిన పత్రికలో "తండాలో తాగునీటి తంటాలు" ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.దీంతో డోర్నకల్ పట్టణ యునైటెడ్ యూత్ కుందోజు లవన్ దిశ పత్రిక కథనాన్ని ట్విట్టర్ వేదికగా సంబంధిత అధికారులకు తెలియపరిచారు. తక్షణమే స్పందించిన మిషన్ భగీరథ అధికారులు మరమ్మతులు చేపట్టి తండా వాసులకు నీటి సరఫరా పునరుద్ధరణ జరిపినట్లు ట్విట్టర్ వేదికగా తెలిపారు.దీంతో దిశ పత్రికకు ఆ తండా గిరిజనులు,అలాగే సోషల్ మీడియా వేదికగా యునైటెడ్ యూత్ లవన్ కు,దిశ ప్రతినిధికి చరవాణి ద్వారా అభినందనలు తెలుపుతున్నారు.


Similar News