MLA Gandra : గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

అన్ని గ్రామాలలో అభివృద్దే తన ధ్యేయమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.

Update: 2024-10-20 11:14 GMT

దిశ, చిట్యాల: అన్ని గ్రామాలలో అభివృద్దే తన ధ్యేయమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఆదివారం మండలంలోని వివిధ గ్రామాలకు, ఆర్ అండ్ బి రోడ్డు నుండి బీటీ రోడ్డు వరకు గల నిర్మాణాలకు ఎమ్మెల్యే టెంకాయ కొట్టి శంకుస్థాపన చేశారు. మండలంలో ఆర్ అండ్ బి రోడ్డు నుండి బావుసింగ్ పల్లి వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులకు రూ. 106 లక్షలతో శంకుస్థాపన చేశారు. బావుసింగ్ పల్లి నుండి ముచ్చినిపర్తి వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులకు రూ. 150 లక్షలతో శంకుస్థాపన చేశారు. ఆర్ అండ్ బి రోడ్డు నుండి జూకల్ గ్రామం వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులకు రూ. 125 లక్షలతో శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్క పేద ప్రజలకు అందేలా చూస్తానని అన్నారు. గుత్తేదారు నాణ్యతతో కూడిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, నాణ్యతలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. మండలంలోని బావుసింగ్ పల్లి గ్రామంలో పంచాయతీ కార్యదర్శి గా విధులు నిర్వహిస్తున్న గుంటుకు స్వప్న డీఎస్సీ 2024 ఎస్జీటీ టీచర్ గా ఎంపికైన సందర్భంగా స్వప్నకు శాలువా కప్పి స్వీట్ తినిపించి అభినందించారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ కమిటీ చైర్మన్ పర్సన్ గుమ్మడి శ్రీదేవి సత్యనారాయణ, మండల అధ్యక్షుడు గుట్ల తిరుపతి, జిల్లా కార్యదర్శి మధు వంశీకృష్ణ, జిల్లా నాయకులు దొడ్డి కిష్టయ్య, మూల శంకర్ గౌడ్, గడ్డం కొమురయ్య, రత్నాకర్ రెడ్డి, కాంగ్రెస్ యువ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Similar News