గ్రామాల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం-మంత్రి సీతక్క

Development of villages is the aim of the government said by Minister Seethakka

Update: 2024-08-18 14:45 GMT

దిశ, ములుగు ప్రతినిధి : గ్రామాలను అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఆదివారం వెంకటాపూర్ మండలం పాపయ్యపల్లి గ్రామంలో రూ.20 లక్షల నిధులతో నిర్మించిన గ్రామపంచాయితీ భవనాన్ని మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకరతో కలసి ప్రారంభించారు. అనంతరం గ్రంథాలయంను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ గ్రామాలలో సిసి రోడ్ల నిర్మాణం పెండింగ్ లో ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని, రెండు కోట్ల 15 లక్షల రూపాయల నిధులతో పాలంపేట రోడ్డు మరమ్మత్తులు చేశామని తెలిపారు. స్మశాన వాటిక నిర్మాణ పనులు కూడా త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. మహిళలకు మంత్రి సీతక్క రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి.శ్రీజ, సిఈఓ సంపత్ రావు, పంచాయతి రాజ్ ఈ ఈ అజయ్ కుమార్, డిడబ్లుఓ స్వర్ణ లత లీనినా, ఎం పి డి ఓ, ఎం పి ఓ, గ్రామ పంచాయతీ ప్రత్యెక అధికారి, కార్యదర్శి, ప్రజా ప్రతినిధులు, స్థల, భవన నిర్మాణ దాతలు, తూడి రవీందర్ రెడ్డి, సుకేందర్ రెడ్డి,మహేందర్ రెడ్డి, మందల లక్ష్మి (మాజీ సర్పంచ్) సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


Similar News