Traffic jam : ఇసుక లారీలతో ట్రాఫిక్ జామ్
చుంచుపల్లి, మల్లూరు(మామిడిగూడెం) ఇసుక క్వారీల్లో నిభందనలకు విరుద్దంగా రోడ్ల వెంట ఇసుక డంపింగ్ చేసిన రేజింగ్ కాంట్రాక్టర్లు డీడీలు తీసిన లారీల్లో లోడింగ్ చేసే సమయంలో వందలాది లారీలను
దిశ, మంగపేట : చుంచుపల్లి, మల్లూరు(మామిడిగూడెం) ఇసుక క్వారీల్లో నిభందనలకు విరుద్దంగా రోడ్ల వెంట ఇసుక డంపింగ్ చేసిన రేజింగ్ కాంట్రాక్టర్లు డీడీలు తీసిన లారీల్లో లోడింగ్ చేసే సమయంలో వందలాది లారీలను రోడ్లపైన నిలపడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. రేజింగ్ కాంట్రాక్టర్లు టీజీఎస్ఎండీసీ అధికారులను మచ్చిక చేసుకుని తమ ఇస్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ సంవత్సరం ఏప్రిల్, మే, జూన్, జూలై నెలల్లో గోదావరి నుండి ఇసుక తోడిన రేజింగ్ కాంట్రాక్టర్లు ఇసుకను ప్రధాన రహదారి వెంట గుట్టలు గుట్టలుగా పోయడంతో లోడింగ్ కు వచ్చే లారీలు డబుల్ లేన్ రోడ్డుకు ఇరువైపుల గంటల తరబడి నిలిపి ట్రాఫిక్ జామ్ కు కారణమవుతున్నాయి.
లోడింగ్ కు వచ్చే లారీలను పార్కింగ్ చేయించాల్సిన రేజింగ్ కాంట్రాక్టర్లు, పర్యవేక్షించాల్సిన TSMDCఅధికారులు కుమ్మక్కై ధనార్జనే ధ్యేయంగా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రభుత్వ నిబంధనల మేరకు ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకే ఆన్లైన్లో డీడీలు పొందిన లారీ యజమానులకు ఇసుక నింపాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా 24 గంటలు తెల్లవార్లు ఇసుక తరలిస్తూ రోడ్లపై ప్రజలు, వాహనాలు తిరగకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వారితో అంటకాగుతుండడంతో ఇసుక రేజింగ్ కాంట్రాక్టర్ల ఆగడాలకు అడ్డులేకుండా పోతుందనే ఆరోపణలున్నాయి. ఇసుక లారీల ఆగడాలను నియంత్రించేది ఎవరనేది చర్చనీయాంశంగా మారింది.