గ్రేట్ డాక్టర్స్: కరోనా పేషెంట్‌కు సుఖప్రసవం

Update: 2022-01-31 16:26 GMT
గ్రేట్ డాక్టర్స్: కరోనా పేషెంట్‌కు సుఖప్రసవం
  • whatsapp icon

దిశ, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని వంద పడకల ఆసుపత్రిలో గర్భవతి అయిన కరోనా పేషెంటుకు వైద్యులు సుఖప్రసవం చేశారు. ప్రియాంక అనే మహిళ డెలివరీ కోసం సోమవారం ఆసుపత్రికి రాగా, ఆసుపత్రి సూపరింటెండెంట్ తిరుపతి ఆదేశాల మేరకు వైద్యులు డాక్టర్ సంధ్యా శ్రీకాంత్, సిబ్బంది సవిత, అరుణ, నవీన్, సౌజన్య కలసి సాధారణ డెలివరీ చేశారు. దీంతో కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ధైర్యంతో కరోనా పేషెంట్‌కు ప్రసవం చేసిన వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు.

Tags:    

Similar News