అభివృద్ధి, సంక్షేమానికి అంకితభావంతో కృషి చేస్తా: MLC కడియం శ్రీహరి

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం నిరంతరం కృషి చేస్తానని మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు.

Update: 2022-12-30 13:13 GMT

దిశ, రఘునాథపల్లి: అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం నిరంతరం కృషి చేస్తానని మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. శుక్రవారం రఘునాథపల్లి మండలంలోని బాంజీపేట గ్రామ పరిధిలోని పిట్టల గూడెంలో కడియం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో ఏనబావి, పోరాషపల్లి, పిట్టల గూడెంలో 175 కుటుంబాలు వేటను వృత్తిగా చేసుకొని జీవనాన్ని గడుపుతున్నాయని.. వీరందరి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

అదేవిధంగా బాంజీపేట గ్రామానికి మహిళా కమ్యూనిటీ భవనం, గీతా కార్మిక భవనం, పిట్టలగూడెంలో మరుగుదొడ్ల నిర్మాణానికి తక్షణసాయంగా రూ.25 లక్షలు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ఆరు నెలల్లోగా ఈ నిధులు సద్వినియోగం అయ్యేలా చూడాలని గ్రామ సర్పంచ్ గొరిగె భాగ్యను ఆదేశించారు. అనంతరం పిట్టలగూడెం వాసులకు పెద్ద ఎత్తున ఆయన దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతుబంధు సమితి సభ్యుడు మారుజోడు రాంబాబు, మండల సభ్యుడు గొరిగె రవి, ఎంపీటీసీ రచ్చ సోమనాథ్, సర్పంచులు గవ్వాని నాగేష్, శివరాత్రి కొమురయ్య, గడ్డమీది కిరణ్ గౌడ్ భానోత్ వెంకట్ నాయక్, చెంచు రమేష్, భూక్య హుస్సేన్, గొరిగే ఇస్తారి, పగిడిపల్లి కృష్ణ,గైని శ్రీనివాస్, లోన్ శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News