కాంగ్రెస్ గ్యారెంటీ కార్డ్స్..ప్రారంభించిన ఝాన్సీ రెడ్డి

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కాంగ్రెస్

Update: 2023-09-18 12:46 GMT

దిశ,తొర్రూర్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ అగ్రనేతలు బాగానే కసరత్తులు చేస్తున్నారు.ఇటీవల తుక్కుగుడా లో జరిగిన కాంగ్రెస్ విజయభేరిలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే గ్యారంటీ 6 సంక్షేమ పథకాలు అమలు చేస్తామని తెలిపారు. ఇందులో భాగంగా పాలకుర్తి నియోజకవర్గ తొర్రూరు మండలం ఆమ్మాపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ 6 పథకాల గ్యారంటీ కార్డులను ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తమిళనాడు సీఎల్పీ నేత సెల్వ పెరుతంగై..పాలకుర్తి టిపిసిసి సభ్యురాలు,కాంగ్రెస్ నాయకురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి,లకు అమ్మాపురం ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా తమిళనాడు సీఎల్పీ నేత పెరుతంగై..మాట్లాడుతూ..కర్ణాటకలో 34 శాతం ఉన్న బిజేపిని అక్కడ ప్రజలు కాంగ్రెస్ ను గెలుపించి బీజేపీ ఉనికి లేకుంటే చేసింది.అలాగే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ 35 శాతం ఉంది కావున మిరాంత కలిసి బీఆర్ఎస్ ను గద్దెదింపేల మనమంతా కృషి చేయాలన్నారు.అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొదట గా సోనియా గాంధీ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీ కార్డులను వెంటనే అమలు చేస్తున్నామన్నారు.అదేవిధంగా పాలకుర్తి కాంగ్రెస్ సభ్యురాలు ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ.... తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీ కార్డులను వెంటనే అమలు చేస్తామని, ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈ ఆరు గ్యారెంటీ కార్డులను ప్రజలకు తెలియజేయాలని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మహిళలు వృద్ధులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


Similar News