అణగారిన వర్గాలకు అభ్యున్నతికే సమగ్ర కులగణన : ఎమ్మెల్యే రేవూరి

అణగారిన వర్గాల అభ్యున్నతి కోసమే సమగ్ర కులగణన

Update: 2024-11-06 14:55 GMT

దిశ,గీసుగొండ: అణగారిన వర్గాల అభ్యున్నతి కోసమే సమగ్ర కులగణన కార్యక్రమాన్ని చేపట్టామని పరకాల ఎమ్మెల్యే రేవూరి అన్నారు. మండలంలోని ఊకల్ క్రాస్ వద్ద గల ఎస్ఎస్ ఫంక్షన్ హాల్ లో గీసుకొండ,సంగెం మండలాల, 15,16,17 వ డివిజన్ల కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవూరి మాట్లాడుతూ గత శాసనసభ ఎన్నికలలో తనను కష్టపడి గెలిపించిన ప్రతి కార్యకర్తకు అండగా నిలబడతానన్నారు. ముందు నుంచి పార్టీని పట్టుకొని ఉన్న కార్యకర్తలకు, ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చిన వారికి,ఎన్నికల తర్వాత పార్టీలోకి వచ్చిన వారికి ఎ,బి,సి గ్రేడ్ల ప్రాధాన్యత ప్రకారం అవకాశాలు ఇస్తానన్నారు. కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు గుర్తింపు లభిస్తుందని రానున్న సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలన్నారు.లోకసభ ఎన్నికలలో పరకాల నియోజకవర్గంలో 30 వేల మెజారిటీ ఇచ్చామని కొంతమంది పక్క నియోజకవర్గ నాయకులు లోకసభ ఎన్నికల్లో మెజారిటీ ఇవ్వకున్నా మీసాలు మేలేస్తున్నారని అన్నారు.

సమగ్ర కుల గణన సర్వే జరిగితే ఏ కులంలో ఎందరు ఉన్నారో,ఎవరికి ఏ విధంగా న్యాయం చేయగలమనే విషయం తెలుస్తుందన్నారు. సమగ్ర కులగణన కార్యక్రమంలో అధికారులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సహకరించాలన్నారు. ఇప్పటివరకు నియోజకవర్గం లో మొత్తంగా 101 కోట్ల 79 లక్షల 20 వేల 432 రూపాయల నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుండి మంజూరై, కొన్ని ప్రతిపాదనలో ఉన్నాయి. మరో వంద కోట్లకు పైగా నిధులతో నియోజక వర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుకు మంజూరు తీసుకొని రావడం జరిగిందన్నారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించి భూములు కోల్పోయిన రైతులకు 100 గజాల స్థలం ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరానని, త్వరలోనే వారికి ఇంటి స్థలాలు ఇచ్చి, ఇందిరమ్మ ఇల్లుకు కూడా ఇప్పిస్తా నన్నారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి కోఆర్డినేటర్ ప్రొఫెసర్ గాదె దయాకర్,టీపీసీసీ ప్రధాన కార్యదర్శి భీమ గాని సౌజన్య, పరకాల కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చాడ కొమురారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, గీసుగొండ మండల పార్టీ అధ్యక్షుడు తుమ్మనపల్లి శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శి కూసం రమేష్,దూల వెంకన్న, కొండేటి కొమురారెడ్డి,సంగెం మండల పార్టీ అధ్యక్షుడు చొల్లేటి మాధవరెడ్డి, 15,16,17 వ డివిజన్ల ముఖ్య నాయకులు,గీసుగొండ, సంగెం మండలాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.


Similar News