అన్ని వర్గాల సంక్షేమ పథకాల అమలుకు సీఎం కేసీఆర్ పెద్ద పీట : చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్
అంబేద్కర్ భవన్ లో నిర్వహించిన బీసీ కుల వృత్తుల లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పాల్గొన్నారు.
దిశ, హనుమకొండ టౌన్ : అంబేద్కర్ భవన్ లో నిర్వహించిన బీసీ కుల వృత్తుల లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పాల్గొన్నారు. అనంతరం చీఫ్ విప్ మాట్లాడుతూ కేసీఆర్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన పథకాలతో నేడు బీసీలు సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు. కులవృత్తులను బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం తెచ్చిన పథకాలతో నేడు ప్రతి పల్లె స్వయం సమృద్ధి సాధించి పల్లెలే ప్రగతికి పట్టుకొమ్మలనే నానుడిని నిజం చేస్తున్నాయి. ఇదే క్రమంలో వెనుకబడిన కుల వృత్తులను బలోపేతం చేసేందుకు బీసీ బంధు పథకం మరింత ఉపయోగపడుతుంది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ బంధు పథకం ద్వారా లక్ష రూపాయల గ్రాంట్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేయడం ఎంతో సంతృప్తినిచ్చింది అని అన్నారు.
వృత్తిని నమ్ముకుని ఆధారపడ్డ కులాలకు ఆర్థిక సాయం అందించి వారిని ప్రోత్సహించడమే ఈ పథకం లక్ష్యం అని, గతంలో కూడా ఆర్థిక సాయం ఇచ్చేవారు కాకపోతే అది అప్పుగా ఇచ్చేవారు. దానికి బ్యాంకుల చుట్టూ తిరిగి ష్యూరిటీ పెట్టి తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది అన్నారు. ఇప్పుడు ఎలాంటి ష్యూరిటీ లేకుండానే ఉచితంగా లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్నారు అన్నారు. బీసీ కులాల్లో అన్ని కుల వృత్తులను ప్రోత్సహిస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్, ముదిరాజు, బెస్త, గీత కార్మికులు, నాయి బ్రాహ్మణులు, గౌడ్, యాదవ సోదరులు ఇలా అన్ని వర్గాలకు సంక్షేమాన్ని అందించారు అని అన్నారు.
గీత, చేనేత, మత్స్య కార్మికులకు ప్రమాద బీమా..
వృత్తినే జీవనాధారంగా చేసుకుని జీవనం కొనసాగిస్తున్న ఆయా వర్గాల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రమాద బీమా కల్పిస్తున్నది అని, తెలంగాణకు పూర్వం కేవలం 19 బీసీ గురుకులాలు, 7580 విద్యార్థులు ఉంటే, నేడు 310 బీసీ గురుకులాల్లో 2022-23లో 33స్కూళ్లను,15 డిగ్రీకాలేజీలు నూతనంగా ఏర్పాటు చేసి, పాతవాట్లో 119 జూనియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేసాం అన్నింట్లో కలిపి 1,81,880 విద్యార్ధులు ఉన్నారు. గత పాలకులకు రాని ఆలోచన, గత పాలకులు చేయని సంక్షేమం ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్నారు అన్నారు.
కుల వృత్తులను కాపాడి వారికి ఆర్థికంగా చేయూత అందించేందుకు బిసి కుల వృత్తిదారులకు 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయపథకం, బ్యాంకుల ద్వారా షూరిటీ, గ్యారెంటీగా లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో నేరుగా లబ్ధిదారులకు ఒక లక్ష రూపాయల చెక్కుల పంపిణీ చేయడం గొప్ప కార్యక్రమం అన్నారు. ముఖ్యమంత్రి బీసీ కుల వృత్తిదారులకు చేయూత అందించాలనే ఉద్దేశంతో నాయి బ్రాహ్మణులు, రజకులకు ఫ్రీ కరెంటు, గొల్ల కురుమలకు గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టారు.
నేతన్నలకు 50 శాతం సబ్సిడీతో నూలు, వారు నేసిన వస్త్రాలను ప్రభుత్వమే కొనుగోలు చేసే చేనేత మిత్ర కార్యక్రమం చేపట్టాం అన్నారు. ప్రతి ఒక్క మండలంలో ఒక బీసీ, ఒక ఎస్సీ, ప్రతి నియోజకవర్గానికి ఒక మైనారిటీ రెసిడెన్షియల్ విద్యాలయాలను ఏర్పాటు చేసుకున్నాము అన్నారు. ఈ కార్యక్రమంలో లైబ్రరీ చైర్మన్ అజీజ్ ఖాన్, అడిషనల్ కలెక్టర్ మహేందర్ జీ, ఆర్డీఓ రమేష్, జీ డబ్ల్యు ఎం సి, డిప్యూటీ కమిషనర్ రవీందర్, బీసీ వెల్ఫేర్ డిడి రాంరెడ్డి, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు , రైతు సమితి కోఆర్డినేటర్లు, వెనుకబడిన తరగతుల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.